Begin typing your search above and press return to search.

వారంలో 5 కేసులే.. ఆ దేశంలో ఎన్ని జాగ్రత్తలో తెలిస్తే అవాక్కే

By:  Tupaki Desk   |   24 Nov 2020 6:45 AM GMT
వారంలో 5 కేసులే.. ఆ దేశంలో ఎన్ని జాగ్రత్తలో తెలిస్తే అవాక్కే
X
ప్రపంచం మొత్తానికి కరోనా దరిద్రం పట్టటానికి కర్మ.. కర్త.. క్రియ అన్ని చైనావోడే అన్న మాట అందరి నోట వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ దేశం చేసిన ఎదవ పనికి.. ఈ రోజున ప్రపంచం మొత్తం ప్రభావితమైన దుస్థితి. కరోనాకు పుట్టిల్లు అయిన వూహాన్ మహానగరం నుంచి విశ్వం మొత్తం వ్యాపించిన కరోనా.. ప్రస్తుతం సెకండ్ వేవ్ కారణంగా పలు దేశాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. చాలా దేశాలకు సంబంధించిన సమాచారం బయటకు వస్తున్నా.. చైనాలో ఏం జరుగుతుందో బయటకు పెద్దగా రాని పరిస్థితి.

ఇదిలా ఉంటే.. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. మన దేశంతోనూ.. మిగిలిన చాలా దేశాలతో పోలిస్తే.. చైనాలోని కొన్ని నగరాల్లో నమోదవుతున్న కేసులు సంఖ్య చాలా చాలా తక్కువ. అయినప్పటికీ.. వారు తీసుకుంటున్న చర్యలు తెలిస్తే.. ముక్కున వేలేసుకోవాల్సిందే.

ఆ దేశంలోని మూడు నగరాల్లో కరోనా కేసులు నమోదవుతుండటంతో.. లాక్ డౌన్ ను విధించారు. విద్యా సంస్థల్నిమూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. చైనాలోని తియాన్జిన్.. షాంఘై.. మంజౌలీ నగరాల్లో చలి తీవ్రత పెరిగింది. ఆ మూడు నగరాల్లో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. షాంఘైలో ఇప్పటికి ఏడు కేసులు నమోదయ్యాయి.

దీంతో ఆ నగరంలోని పుదోంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 17,719 మంది సిబ్బందికి కోవిడ్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. ఇక.. తియాన్జిన్ లో వారంలో ఐదు కేసులు నమోదు కావటంతో ఆ ప్రాంతం మొత్తం నిర్దారణ పరీక్షలతో జల్లెడ పట్టేస్తున్నారు.

ఈ ప్రాంతంలో దాదాపుగా 20 లక్షల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించటం గమనార్హం. ఇదంతా చూస్తే.. కరోనా విషయంలో చైనావోడు ఎంత అప్రమత్తంగా ఉన్నారన్నది ఇట్టేఅర్థమువుతుందని చెప్పాలి. ఈ లెక్కన మనం.. మన జాగ్రత్తలు ఏమేరకు ఉన్నాయో అర్థమవుతోందా?