Begin typing your search above and press return to search.
ఢిల్లీలో వైరస్ విజృంభణ ...ప్రతీ ముగ్గురిలో ఒకరికి
By: Tupaki Desk | 15 Jun 2020 6:10 AM GMTదేశంలో వైరస్ జోరు ఏ మాత్రం తగ్గడంలేదు. రోజురోజుకి వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి, తప్ప తగ్గడంలేదు. వైరస్ కట్టడి కోసం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో అటు ప్రభుత్వం ..ఇటు ప్రజల్లో ఆందోళన పెరిగిపోతుంది. ముఖ్యంగా దేశరాజధాని ఢిల్లీ వైరస్ కి కేరాఫ్ గా మారిపోతుంది. ఈ ఒక్క వారంలోనే ఢిల్లీలో కోవిడ్ మృతులు 156% పెరిగిపోయాయి. ఢిల్లీ లో కనీసం వైరస్ సోకిన వ్యక్తికీ హాస్పిటల్ లో బెడ్ దొరుకుతుందో లేదో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి అక్కడ కొనసాగుతుంది.
ఒకవేల బెడ్ దొరికినా సరైన చికిత్స అందదు. దురదృష్టం వెంటాడి ప్రాణాలు కోల్పోతే ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని తీసుకురావడానికి గంటల తరబడి వేచి చూడాలి. శ్మశానంలో అంతిమ సంస్కారానికి మరో ఆరు గంటలు క్యూలో ఉండాలి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఢిల్లీ ఎలాంటి పరిస్థితుల్లో ఉందొ. ఇప్పటివరకు 1,271 మంది మరణించారు. కేసుల సంఖ్య 39 వేలకు చేరుకుంది. జూలై 31 నాటికి కేసుల సంఖ్య 5 లక్షలు దాటిపోతుందని, అప్పటికి లక్ష పడకలు కావాలని ఢిల్లీలోని ఆప్ సర్కార్ అంచనా వేస్తోంది.
ప్రస్తుతం ఢిల్లీలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 10 వేల వరకు పడకలు ఉన్నాయి. అవన్నీ దాదాపుగా నిండిపోవడం తో వైరస్ రోగులు పడరాని పాట్లు పడుతున్నారు. అలాగే , సగటున ముగ్గురికి పరీక్షలు చేస్తే ఒక కేసు పాజిటివ్ గా నమోదు అవుతోందని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ లెక్కన ఢిల్లీవ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తే మూడింట ఒక వంతు మందికి కోవిడ్ నిర్ధారణ అవుతుందని తేలుతోంది. ముంబై, చెన్నై వంటి నగరాలతో పోల్చి చూస్తే ఢిల్లీ అత్యంత తక్కువగా పరీక్షలు నిర్వహిస్తోంది. గత నెలలో రోజుకి 7 వేల పరీక్షలు నిర్వహించే రాజధానిలో హఠాత్తుగా వాటి సంఖ్య గతవారంలో 5 వేలకు తగ్గిపోయింది. దీనిపై సుప్రీం కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.