Begin typing your search above and press return to search.

స‌రికొత్త రికార్డు: కేసుల్లో చైనాను దాటేస్తున్న మ‌హారాష్ట్ర‌

By:  Tupaki Desk   |   6 Jun 2020 1:30 PM GMT
స‌రికొత్త రికార్డు: కేసుల్లో చైనాను దాటేస్తున్న మ‌హారాష్ట్ర‌
X
దేశ‌వ్యాప్తంగా మ‌హ‌మ్మారి వైరస్ విజృంభిస్తోంది. ఒక‌ప్పుడు అమెరికా, ఇట‌లీ దేశాల కేసులను చూసి భ‌యాందోళ‌న వ్య‌క్తం చేసిన మ‌నం ఇప్పుడు మ‌న‌దేశంలో ఉన్న లెక్క‌ల‌ను ప్ర‌పంచ దేశాలు ఆశ్చ‌ర్య‌పోతున్నాయి. భార‌త్‌లో రోజుకు దాదాపు ప‌దివేల‌కు చేరువ‌గా కేసులు న‌మోదవుతున్నాయి. దీంతో 20 రోజుల్లోనే ల‌క్షా 30 వేల పాజిటివ్ కేసులు పెరిగాయి. దేశంలోనే ముఖ్యంగా మ‌హారాష్ట్ర‌లో వైర‌స్ తీవ్రంగా ప్ర‌బ‌లుతోంది. వైర‌స్ పుట్టుక‌కు కార‌ణ‌మైన చైనాలోనే ఇంత‌లా వ్యాప్తి చెంద‌లేదు. ఒక్క చైనా దేశంలో న‌మోదైన కేసుల‌న్నీ ఒక్క మ‌హారాష్ట్ర‌ లోనే న‌మోద‌య్యా‌యంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు.

దేశంలో ఇప్పటివరకు 2,36,657 కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 6,642కి చేరింది. ఈ కేసుల‌తో ప్ర‌పంచంలో టాప్ స్థాయికి భార‌త్ దూసుకెళ్లింది. ప్ర‌స్తుతం అత్య‌ధిక కేసులు న‌మోద‌వుతున్న జాబితాలో ఆరో స్థానానికి భార‌త‌దేశం ఎగ‌బాకింది. అయితే భార‌త్‌లో న‌మోద‌వుతున్న‌ కేసుల్లో అధిక భాగం మహారాష్ట్రకు చెందిన‌వే ఉన్నాయి. మహారాష్ట్ర లో దాదాపు 80 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో త్వ‌ర‌లోనే వైర‌స్ లెక్క‌ల్లో చైనాను మ‌హారాష్ట్ర దాటనుంది. ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర‌లో శ‌నివారం వ‌ర‌కు 77,793 కేసులు ఉన్నాయి. రోజుకు వేల సంఖ్య‌ లో కేసులు న‌మోదవుతున్నాయి. ఈ విధంగా న‌మోద‌వుతూ త్వ‌ర‌లోనే ల‌క్ష మార్క్‌ ను మ‌హారాష్ట్ర దాట‌నుంది. ఈ క్ర‌మంలోనే వైర‌స్‌ కు జ‌న్మ‌నిచ్చిన చైనాను కూడా దాట‌నుంది. ఇప్ప‌టివ‌ర‌కు చైనాలో 83,030 కేసులు ఉన్నాయి. చైనాలో న‌మోదైన సంఖ్య‌లో ఒక్క మహారాష్ట్రలో న‌మోద‌వ‌డం గ‌మ‌నార్హం. ఇక ఈ వైర‌స్ బారిన మృతి చెందిన వారిలో మహారాష్ట్ర లోనే 2,849 ఉన్నాయి.