Begin typing your search above and press return to search.

తీవ్రమైన మహమ్మారి.. 80 లక్షల చేరువలో కేసులు !

By:  Tupaki Desk   |   15 Jun 2020 5:30 AM GMT
తీవ్రమైన మహమ్మారి.. 80 లక్షల చేరువలో కేసులు !
X
దేశవ్యాప్తంగా వైరస్ జోరు కొనసాగుతోంది. తాజాగా 11502 కొత్త కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 332424గా ఉంది. అలాగే, నిన్న దేశంలో 325 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 9520గా ఉంది. నిన్న దేశంలో 7419 మంది రికవరీ అవ్వడంతో మొత్తం రికవరీల సంఖ్య 169797గా ఉంది. అదే సమయంలో యాక్టివ్ కేసుల సంఖ్య 153106గా ఉంది. తొలిసారిగా యాక్టివ్ కేసులు లక్షా 50 వేల మార్కును దాటాయి. అందువల్ల రికవరీలు 51.1 శాతానికి పెరిగాయి. ఇది శుభ పరిణామంగా చెబుతున్నారు. కాగా ప్రస్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా కేసులు అధికంగా ఉన్న దేశాల్లో ఇండియా నాలుగో స్థానంలో నిలిచింది.

ఇక, ఆంధ్రప్రదేశ్‌ లో ఈ వైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. రోజు, రోజుకు పెరుగుతున్న కేసులు భయపెడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 15,633 శాంపిల్స్ పరిశీలించగా, 253 మందికి వైరస్ పాజిటివ్‌ గా తేలినట్లు ఆదివారం మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తాజా కేసులు కలిపితే రాష్ట్రానికి సంబంధించిన కేసులు కు 4,841 చేరాయి. అలాగే విదేశాల నుంచి వచ్చిన వారిలో 204 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 1,107 మందికి వైరస్ పాజిటివ్ అని తేలింది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే 6,152 మందికి కరోనా పాజిటివ్‌ గా తేలింది.

ఇక తెలంగాణలో ఆదివారం ఒక్కరోజులోనే అత్యంత భారీ సంఖ్యలో వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించారు. మొత్తం 237 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం వైరస్ కేసుల సంఖ్య 4974కు చేరుకుంది. వీటిలో, మొత్తం లోకల్ కేసులు మాత్రం 4535 అని హెల్త్ బులెటిన్‌ లో వివరించారు. ఇప్పటి వరకు తెలంగాణ లో 2377 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే ఇప్పటివరకు 185 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 2412 మంది యాక్టివ్ కేసులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇక ప్రపంచవ్యాప్తంగా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 80 లక్షలకు చేరువవుతున్నాయి. నిన్న 121691 కేసులొచ్చాయి. మొత్తం కేసులు 7982215కి చేరాయి. నిన్న 3248 మంది చనిపోవడం తో... మొత్తం మరణాలు 435166కి చేరాయి. మంచి విషయమేంటంటే... రోజువారీ మరణాల సంఖ్య తగ్గుతోంది.