Begin typing your search above and press return to search.
ఇండియాలో వైరస్ విజృంభణ ...10 వేలకు చేరువలో మరణాలు !
By: Tupaki Desk | 16 Jun 2020 5:30 AM GMTప్రపంచ దేశాలపై వైరస్ విలయతాండవం చేస్తుంది. మొదటితో పోలిస్తే పలు దేశాల్లో వైరస్ వ్యాప్తి కొంతమేర తగ్గుముఖం పట్టినప్పటికీ.. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి భారీగా పెరిగిపోతుంది. మంగళవారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 81.07 లక్షలకుపైగా చేరుకుంది. వైరస్ బారినపడి 4.38 లక్షల మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 41.87 లక్షల మంది కోలుకున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం భారతదేశంలో వైరస్ కేసులు భారీ స్థాయిలో నమోదు అవుతున్నాయి.
ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా మరో 10667 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు నమోదు అయిన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 343091కి చేరుకుంది. గత 24 గంటల్లో 380 మంది చనిపోవడంతో... మరణాల సంఖ్య 9900కి చేరింది. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేసులు 180012 ఉన్నాయి. నిన్న 10215 మంది రికవరీ లేదా డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఇండియాలో వైరస్ మరణాల రేటు 2.9గా ఉంది. రికవరీ రేటు మాత్రం కాస్త పెరిగి... 52.5కి చేరింది. నిన్న ఇది 51 శాతంగా ఉంది.
దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, బెంగాల్ రాష్ట్రాలపై ఎక్కువ ఫోకస్ పెడుతోంది. ఈ 8 రాష్ట్రాల్లో కరోనా కేసులు 10వేలకు పైగా ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 110744 చేరింది. వైరస్ మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 56049 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 4128 మంది మరణించారు. తాజా లెక్కలతో బీఎంసీ పరిధిలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59201కి చేరింది. ఈ మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 2248 మంది మరణించారు. ముంబైలో ఇప్పటి వరకు 30125 మంది వైరస్ పేషెంట్లు కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ముంబై మహానగరంలో 26828 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
ఇక ఏపీలో వైరస్ పాజిటివ్ కేసులు 5087కు (మొత్తం 5636కు) చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2231కు చేరింది. విదేశాల నుంచి వచ్చి వైరస్ పాజిటివ్ అయిన వారు 210 మంది ఉన్నారు. వారిలో 187 మంది ఇప్పుడు యాక్టివ్ కేసులుగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైరస్ తో మొత్తం 86మంది చనిపోయారు.ఏపీలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కరోనా పాజిటివ్‌గా తేలినవారు... 1159 మంది ఉన్నారు. వారిలో ఇప్పుడు 567 మంది యాక్టివ్ గా ఉండగా... ఇవాళ 22 మందిని డిశ్చార్జి చేశారు.
ఇకపోతే , తెలంగాణలో ఈ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజుకు 200కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. సోమవారం 219 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజా కేసులతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 5,193 కి చేరింది. వీరిలో 449 మంది విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, వలస కార్మికులు ఉన్నారు. e వైరస్ తో పోరాడుతూ తెలంగాణలో ఇప్పటి వరకు 2766 మంది వైరస్ బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 2240 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక తెలంగాణ లో మొత్తం వైరస్ మరణాల సంఖ్య 187కి చేరింది.