Begin typing your search above and press return to search.
భారత్ లో వైరస్ జోరు ...ఒక్కరోజే 2003 మంది మృతి !
By: Tupaki Desk | 17 Jun 2020 5:45 AM GMTప్రపంచ దేశాలపై వైరస్ విజృంభణ కొనసాగుతుంది. మొదటితో పోలిస్తే పలు దేశాల్లో వైరస్ వ్యాప్తి కొంతమేర తగ్గుముఖం పట్టినప్పటికీ.. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి భారీగా పెరిగిపోతుంది. బుధవారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 82.64 లక్షలకుపైగా చేరుకుంది. వైరస్ బారినపడి 4.38 లక్షల మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 43.21 లక్షల మంది కోలుకున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం భారతదేశంలో వైరస్ కేసులు భారీ స్థాయిలో నమోదు అవుతున్నాయి.
ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా మరో 10974 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు నమోదు అయిన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 354065కి చేరింది. అలాగే... నిన్న ఒక్క రోజే... 2003 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య... 11903కి చేరింది. మరణాల రేటు 2.9 శాతం నుంచి 3.4 శాతానికి పెరగడం అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నట్లే. ఎందుకంటే ప్రస్తుతం రోజూ 300 మంది లోపు చనిపోతున్నారు. అలాంటిది నిన్న ఒక్క రోజే... 2003 మంది చనిపోవడం షాకింగ్ విషయమే. ప్రస్తుతం దేశంలో రికవరీ కేసులు 186934గా ఉన్నాయి. రికవరీ రేటు 52.8 శాతంగా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 155227గా నమోదయ్యాయి
ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 24 గంటల్లో 15911 శాంపిల్స్ టెస్ట్ చెయ్యగా... 193 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. వారికి తగిన జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటోంది. ప్రస్తుతం ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5280కి చేరింది. వాటిలో ఇప్పటివరకూ 2851 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వైరస్ తో మొత్తం 88మంది చనిపోయారు. ప్రస్తుతం ట్రీట్‌మెంట్ పొందుతున్న యాక్టివ్ కేసుల సంఖ్య 2341గా ఉంది.
ఇకపోతే , తెలంగాణలో ఈ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజుకు 200కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. మంగళవారం 213 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో 165, రంగారెడ్డిలో 16, మెదక్ లో 13, కరీంనగర్లో 6, మేడ్చల్ లో 3, సంగారెడ్డి, నిజామాబాద్ లో 2 చొప్పున, పెద్దపల్లి, సిద్దిపేట, యాదాద్రి, జనగాం, కామారెడ్డి, అసిఫాబాద్ లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. తాజా కేసులతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 5,406 కి చేరింది. ఈ వైరస్ తో పోరాడుతూ తెలంగాణలో ఇప్పటి వరకు 3027 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 2188 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 191కి చేరింది.