Begin typing your search above and press return to search.

9154170960కు ప్రైవేటు ఆసుపత్రి ఆరాచకాలపై ఫిర్యాదు చేయొచ్చు

By:  Tupaki Desk   |   16 July 2020 2:00 PM IST
9154170960కు ప్రైవేటు ఆసుపత్రి ఆరాచకాలపై ఫిర్యాదు చేయొచ్చు
X
కష్టం చెప్పి రాదు. అందునా కరోనా వేళ.. ఎప్పుడు ఎవరి అవసరం వస్తుందో తెలీని పరిస్థితి. ఇలాంటివేళ.. అన్నింటికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఊహించని విధంగా విరుచుకుపడే మహమ్మారికి చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తే.. అక్కడి పని తీరు.. వారి దందాపై కంప్లైంట్ చేయాలంటే.. ఎవరికి చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సౌకర్యాన్ని తీసుకొచ్చింది.

తాజాగా ప్రజలకు ఒక వాట్సాప్ నెంబరును అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనాకు చికిత్స చేస్తున్న కార్పొరేట్ వైద్యులపై వెల్లువెత్తే ఫిర్యాదుల్ని ప్రభుత్వం వరకు తీసుకెళ్లేందుకు వీలుగా 9154170960 నెంబరును ఏర్పాటు చేశారు. కార్పొరేట్ ఆసుపత్రికి వైద్యానికి వెళ్లినప్పుడు ఎదురైన చేదు అనుభవాల గురించి వాట్సాప్ లో మెసేజ్ రూపంలో పంపొచ్చు.

తమకు వచ్చే కంప్లైంట్లపై విచారణ జరిపి.. ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోనున్నారు. అంతేకాదు.. కోవిడ్ చికిత్స కోసం ప్రభుత్వం ఇప్పటికే టారిఫ్ ను సిద్ధం చేసింది. అందుకు భిన్నంగా అసాధారణంగా బిల్లులు వేసినా వాటికి సంబంధించిన సమాచారాన్ని వాట్సాప్ ద్వారా ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు రూపంలో చేసే వీలుంది. ఇటీవల కాలంలో కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ ఎక్కువైందన్న ఆరోపణలు అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. ఈ నెంబరును సేవ్ చేసుకోవటం చాలా అవసరమని చెప్పక తప్పదు.