Begin typing your search above and press return to search.
వైరస్ వీక్ అంటున్న వేళలోనే.. కేసుల నమోదులో సరికొత్త రికార్డు
By: Tupaki Desk | 26 Sept 2020 10:00 AM ISTప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వైరస్.. అంతకంతకూ విస్తరిస్తోంది. ఓవైపు వైరస్ తీవ్రత తగ్గిందన్న మాట వినిపిస్తోంది. మరోవైపు కొత్త కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. కాస్తోకూస్తో ఉపశమనం కలిగించే అంశం.. రికవరీల రేట్లు పెరగటం. వైరస్ బలహీనపడుతుందని చెబుతున్న వేళలోనే.. ప్రపంచ వ్యాప్తంగా ఒకే రోజులో రికార్డు స్థాయిలో మూడు లక్షల కేసులు నమోదయ్యాయి.
ప్రపంచ వ్యాప్తంగా నిన్నటి ఒక్కరోజులోనే 3,13,629 కేసులు నమోదైనట్లుగా తేల్చారు. దీంతో.. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసులు 3.27కోట్లు. నిన్నటి ఒక్కరోజులో కరోనా కారణంగా 5700 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 9.92లక్షలుగా తేల్చారు. రికవరీ కేసులు 2.41 కోట్లు కాగా.. యాక్టివ్ కేసులు 75.97లక్షలుగా తేల్చారు. వీరిలో 63వేల మందికి పైనే కండీషన్ బాగోలేదని చెబుతున్నారు.
మొత్తం కేసుల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంటే.. రోజువారీగా నమోదయ్యే కేసుల విషయంలో మాత్రం భారత్ నెంబరు వన్ స్థానంలో నిలిచింది. అమెరికాలో రోజువారీగా 50వేలకు పైనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. భారత్ విషయానికి వస్తే కొత్తగా నమోదైన కేసులు 86వేలకు పైనే ఉండటం. మొన్నీమధ్యన రోజుకు 90వేల మార్కును టచ్ చేసిన కొత్త కేసులు... ఇప్పుడు కాస్త తగ్గినట్లుగా చెప్పాలి.
కొత్త కేసుల నమోదులో భారత్ మొదటిస్థానంలో ఉంటే అమెరికా రెండోస్థానంలో బ్రెజిల్ మూడో స్థానంలో నిలిచింది. ఇక.. మరణాల విషయంలో అమెరికా టాప్ లో ఉంటే.. భారత్ మూడో స్థానంలో ఉంది. రికవరీలు కూడా ఆశావాహంగా ఉన్నాయి. ఇక.. మన దేశానికి వస్తే.. మొత్తం కేసుల్లో అత్యధికం మహారాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ప్రస్తుతం భారత్ లో 9.70లక్షల కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటివరకు వైరస్ కారణంగా దేశంలో 34వేలకు పైనే మరణించారు.
కొత్త కేసుల నమోదులో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంటే.. ఏపీ రెండో స్థానంలో నిలిచింది. ఇక.. తమిళనాడు.. కర్ణాటక.. యూపీ రాష్ట్రాలు ముందున్నాయి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణతో పోలిస్తే ఏపీలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. సరాసరిన ఏపీలో రోజువారీగా ఆరేడు వేల కేసులు నమోదవుతుంటే.. తెలంగాణలో మాత్రం పదిహేను.. రెండు వేల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మాత్రం 2381 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావటం గమనార్హం. వైరస్ బలహీనమవుతుందన్న ధీమాతో ఎవరికి వారు తమ సొంత పనుల్లో మునిగిపోవటం కూడా కొత్త కేసులు భారీగా నమోదు కావటానికి కారణంగా చెప్పక తప్పదు.