Begin typing your search above and press return to search.
భారత్ కరోనా అప్డేట్ : 78 లక్షలు దాటిన కేసులు ..కొత్తగా ఎన్నంటే !
By: Tupaki Desk | 24 Oct 2020 12:00 PM ISTదేశంలో కరోనా మహమ్మారి జోరు ఏ మాత్రం తగ్గడంలేదు. రోజురోజుకి కరోనా మహమ్మారి వ్యాధి తీవ్రత పెరుగుతూనే పోతుంది. అయితే ఈ మధ్య కాలంలో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసుల నమోదు సంఖ్యలో కొంచెం తగ్గుదల కనిపిస్తుండటం , అలాగే రికవరీ శాతం ప్రపంచంతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉండటం శుభపరిణామం. అయితే , కరోనా మహమ్మారిని అరికట్టే వ్యాక్సిన్ వచ్చేవరకు ఈ వ్యాధి కేసులు పూర్తిగా తగ్గేలా అయితే కనిపించడంలేదు. ఇకపోతే , గడచిన 24 గంటల వ్యవధిలో ఇండియాలో 53,370 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఈ విషయాన్ని వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ, మొత్తం కేసులు 78,14,682కు చేరుకున్నాయని వెల్లడించింది. ఇదే సమయంలో గత 24 గంటల్లో మరో 650 మంది మహమ్మారి కారణంగా మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 1,17,956కు చేరింది.
ఇండియాలో మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. అంటే ఇండియాలో కరోనా సోకిన వారిలో ప్రతి 100 మందిలో ఒకరు లేదా ఇద్దరు చనిపోతున్నారు. ప్రపంచ దేశాల్లో అది 2.7 శాతంగా ఉంది. ప్రపంచ దేశాలతో పోల్చితో ఇండియాలోనే కరోనా కంట్రోల్ అవుతూ వస్తుంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,80,680కి చేరాయి. ఇక ఇండియాలో నిన్న 12,69,479 టెస్టులు చెయ్యగా... మొత్తం టెస్టుల సంఖ్య 10కోట్ల 13లక్షల 82వేల 564కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయనవారి సంఖ్య 70,16,046గా ఉంది.ప్రస్తుతం మొత్తం కేసుల్లో అమెరికా టాప్‌లో కొనసాగుతోంది. భారత్, బ్రెజిల్, రష్యా, స్పెయిన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రోజువారీ కొత్త కేసుల్లో అమెరికా మొదటి స్థానంలో కొనసాగుతుంటే... ఆ తర్వాత ఇండియా, ఫ్రాన్స్ , బ్రెజిల్, బ్రిటన్ , స్పెయిన్ ఉన్నాయి. యూరప్ దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. మొత్తం మరణాల్లో అమెరికా టాప్‌లో ఉండగా... బ్రెజిల్ , ఇండియా, మెక్సికో, బ్రిటన్, ఇటలీ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.