Begin typing your search above and press return to search.
కరోనా పోయిందని సంబరపడకండి.. సెకండ్ వేవ్ వచ్చిందంటే ఇక అంతే!
By: Tupaki Desk | 28 Oct 2020 8:05 AM ISTప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మరణాల రేటు చాలా తక్కువగా ఉందని.. కోలుకుంటున్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రజల్లోనూ భయం తగ్గింది. ప్రజలెవరూ మాస్కులు పెట్టుకోవడం లేదు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దేశంలో క్రమంగా తగ్గుతోంది. నెల రోజుల క్రితం ప్రతీ రోజు లక్ష వరకు పాజిటీవ్ కేసులు నమోదు కాగా ఇప్పుడు 50 వేల లోపే నమోదవుతున్నాయి.భౌతికదూరం సంగతే మరిచిపోయారు. పండగలు, పబ్బాలు అంటూ గుంపులు గుంపులుగా కలిసి తిరుగుతున్నారు. ప్రస్తుతం శానిటైజర్లకు కూడా గిరాకీ పడిపోయింది. కరోనా పీక్స్‌లో ఉన్నప్పుడు 100 ఎంఎల్ బాటిల్‌కు 100రూపాయలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు శానిటైజర్ కొనేవాళ్లు లేరు.
అయితే ప్రస్తుతం ప్రజలు ఆలోచిస్తున్న తీరు సరికాదని కరోనా సెకండ్‌వేవ్ వచ్చిందంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ సెకండ్ అంటే ఏమిటి? దానిపై వైద్యనిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.. ఏదైనా వైరస్ మానవాళిపై దాడి చేసినప్పుడు దశలవారీగా దాడి చేస్తుంది. దీనిని మల్టిపుల్ వేవ్స్ అంటారు. కరోనా ఇప్పటివరకు మన మీద చూపించింది ఫస్ట్ వేవ్ మాత్రమే. ఫస్ట్ వేవ్‌లో కరోనా కేసుల కర్వ్ పెరిగి ఇప్పుడు క్రమంగా తగ్గుతోంది. అంత మాత్రాన ఇక కరోనా పూర్తిగా దూరమైనట్లు కాదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సెకండ్ వేవ్ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి మన సమాజంలో కరోనా ప్రభావం తగ్గిపోయిన తర్వాత మళ్లీ ఇంకోసారి విజృంభిస్తుంది. దీనినే సెకండ్ వేవ్స్ అంటారు.
ఒకసారి కరోనా సోకి తగ్గినవారికి కూడా మరోసారి కరోనా రావోచ్చు. ఇందుకు ముఖ్యంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఇది పండుగల సీజన్. ప్రజలు కరోనా నిబంధనలను మరిచిపోయి బయటకు వెళుతున్నారు. ఇంకో ముఖ్య కారణం రానున్నది చలికాలం కావడం. సాధారణంగా ఏ వైరస్ అయినా ఎండాకాలంలో కొంత బలహీనంగా ఉంటుంది. చలికాలంలో దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు దేశంలో చలికాలం ఆరంభం కావడంతో కరోనా ప్రభావం సేకెండ్ వేవ్‌లో కూడా ఎక్కువగానే ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. కాబట్టి వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలు జాగ్రత్తగానే ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.