Begin typing your search above and press return to search.

కరోనా మృత్యుఘోష... ఒక్కరోజులో 11 వేల మరణాలు!

By:  Tupaki Desk   |   28 Nov 2020 1:20 PM IST
కరోనా మృత్యుఘోష... ఒక్కరోజులో 11 వేల మరణాలు!
X

ప్రపంచానికి కరోనా పరిచయమై సంవత్సరం దాటింది. ఇప్పటికీ ఆ మహమ్మారి వదల్లేదు. ఏ పని చెయ్యాలన్నా... స్వేచ్చ లేదు. మాస్కుతో అన్నీ ఇబ్బందులే. సేఫ్ డిస్టాన్స్ పాటించే పరిస్థితులు లేవు. శానిటైజర్లతోనూ తిప్పలే. ప్రపంచాన్ని పట్టుకున్న కరోనాతో మానవాళి ఉన్న సమస్యలకు తోడు అతిపెద్ద కొత్త సమస్యతో ఏడాదిగా సతమతమవుతోంది. ఇప్పటికీ ఆ వైరస్ జోరు తగ్గకపోగా చలికాలంలో పెరుగుతోంది. ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్ల తయారీ, ఉత్పత్తి ప్రక్రియ జోరందుకుంటోంది. ప్రపంచమంతా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది.

ఇప్పటికే కోట్లాది మందికి కరోనా సోకింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది మరణించారు. వాతావరణంలో వస్తున్న మార్పులు, చలిగాలులు ప్రభావంతో కరోనా వైరస్ తీవ్రత రోజు రోజుకు వైరస్ ప్రభావం పెరిగిపోతుంది. నిన్న ఒక్కరోజే ప్రపంచం మొత్తం మీద 6 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 6,03,553 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచం మొత్తం మీద ఇప్పటి వరకు 6,19,53,817కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో 10,727 మంది మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,48,165కి చేరింది.

భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. భారత్‌ లో నమోదైన మొత్తం కరోనా కేసులు 93లక్షలు దాటేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 41,322 కరోనా‌ పాజిటివ్‌ కేసులునమోదు కాగా..485మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు భారత్‌ లో నమోదైన కరోనా కేసుల సంఖ్య93,51,109కు చేరగా.. కరోనా‌ మరణాల సంఖ్య 1,36,200గా నమోదైంది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ ను విడుదల చేసింది. ప్రస్తుతం రికవరీ రేటు 93.68 శాతంగా ఉంది. కాగా, నిన్న 11,57,605 నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇదిలా ఉండగా..కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసే టీకా కోసం దేశమంతా ఎదురుచూస్తోన్న తరుణంలో శనివారం ప్రధాని మోదీ టీకా తయారీలో పాలుపంచుకొంటున్న భారత్ బయోటెక్‌, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, జైడస్ క్యాడిలా సంస్థలను సందర్శించనున్నారు.