Begin typing your search above and press return to search.
దేశంలో ఏప్రిల్ లో కరోనా విధ్వంసం : 66 లక్షల కేసులు ... 48 వేల మరణాలు
By: Tupaki Desk | 1 May 2021 11:04 AM ISTదేశంలో కరోనా రెండవ వేవ్ విజృంభణ శరవేగంగా కొనసాగుతుంది. ప్రతి రోజు కూడా రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో 2021 ఏప్రిల్ ఒక్క నెలలో మాత్రమే 6.6 మిలియన్ల తాజా కేసులు నమోదు అయ్యాయి. అలాగే ,కొరోనా వైరస్ కారణంగా గత నెలలో 48,000 మంది మరణించారు. ఇది గత సంవత్సరం 2020 సెప్టెంబర్ నుండి 6 నెలల్లో నమోదైన కేసుల సంఖ్యకు సమానం అని చెప్పవచ్చు. దేశంలోని మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, గుజరాత్, జార్ఖండ్, పంజాబ్, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ లో గత నెలలో కరోనా ఉగ్రరూపం చూపించింది.
ఇదిలా ఉంటే .. గత 24 గంటల్లో 4,08,323 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. దీనితో, భారతదేశం యొక్క COVID-19 అధికారిక సంఖ్య 2021 ఏప్రిల్ చివరి నాటికి 1,91,63,488 కి పెరిగింది. మొత్తంగా గత ఏడాది సెప్టెంబర్ తర్వాత కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చిన కరోనా ఆ తర్వాత ఏప్రిల్ ఒక్క నెలలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏప్రిల్ 5 నుండి, దేశంలో ఒక రోజులో లక్షకు పైగా కేసులు నమోదు అవుతూ వచ్చాయని , ఆ తర్వాత ఏప్రిల్ 15 నుండి, ఒకే రోజు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు లక్షలు దాటిందని , అలాగే ఇక ఏప్రిల్ 22 నుండి, రోజువారీ మూడు లక్షలకు పైగా కేసులను నమోదు అవుతూ వచ్చాయని అన్నారు. ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 14 వరకు మహారాష్ట్రలో 43.2 శాతం కేసులు, ఛత్తీస్ ఘడ్ లో (7.4 శాతం), ఉత్తర ప్రదేశ్ లో (6.2 శాతం) కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతూ వచ్చాయి. అలాగే ఆ 14 రోజుల కాలంలో దేశంలోని మిగిలిన ప్రాంతాలలో 43.1 శాతం కేసులు నమోదయ్యాయి. ఇక ,ఏప్రిల్ 15 నుంచి 28 వరకు మహారాష్ట్ర 21.6 శాతం కేసులు నమోదు కాగా , ఉత్తరప్రదేశ్ (10.4 శాతం), ఢిల్లీ (7.8 శాతం) కేసులు నమోదు అయ్యాయి. ఇక ఇదే సమయంలో దేశంలోని మిగిలిన ప్రాంతాలలో 60.2 శాతం కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ నెలలో కరోనా దేశంలో విస్తరించిన విధానాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లావ్ అగర్వాల్ తెలియజేశారు.