Begin typing your search above and press return to search.
ఆ పెళ్లికి 700 మంది.. వారిపై కేసులు బుక్
By: Tupaki Desk | 13 March 2021 7:30 AM GMTతగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు చాప కింద నీరులా మారాయి. అంతకంతకూ ఎక్కువ అవుతున్న కేసుల్ని పెద్దగా పట్టించుకోని వారి తీరుతో.. పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు సెకండ్ వేవ్ ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఆంక్షలు విధిస్తున్నాయి. మొదట్లో కరోనా అంటే భయపడిన జనాలు.. ఇప్పుడు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోని పరిస్థితి. పెళ్లిళ్లకు యాభై మందికి మించిన హాజరు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చట్టం చెబుతున్నా.. వాస్తవంలో మాత్రం అదేమీ పట్టించుకోకుండా వందలాది మందిని పిలుస్తున్నారు.
తాజాగా మహారాష్ట్రలో అలాంటి వేడుకే ఒకటి జరిగింది. దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్నమహారాష్ట్రలో కరోనా తీవ్రతను అక్కడి ప్రజలు అసలు పట్టించుకోవటం లేదా? అన్న అనుమానం కలిగేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా థానే జిల్లాలోని కల్యాణ్ లో జరిగిన ఒక పెళ్లికి 700 మంది అతిధులు హాజరు కావటం అధికారులకు షాకిచ్చింది. ఈ పెళ్లి వేడుకకు హాజరైన పెళ్లి పెద్దలపై కేసులునమోదు చేశారు.
పెళ్లి వేడుకకు భారీగా అతిధులు హాజరైనట్లు సమాచారం అందుకున్న అధికారులు.. పెళ్లి వేదిక వద్దకు వెళ్లి చూడగా అవాక్కు అయ్యారు. వందలమంది అతిధులు.. ఎవరు ముఖానికి మాస్కు పెట్టుకోకపోవటం.. శానిటైజర్లు వినియోగించకపోవటంతో పాటు భౌతికదూరం సూత్రాన్ని అస్సలు పట్టించుకోలేదట. దీంతో.. స్పందించిన అధికారులు పెళ్లి జరిపించిన రాజేశ్.. మహేశ్ లపై కేసులు నమోదు చేశారు. అధికారులు ఎంతలా ప్రచారం చేస్తున్నా.. కేసులు పెడుతూ చర్యలు తీసుకున్నా.. ప్రజలు మాత్రం తాము చేయాల్సింది చేసేస్తున్నారని చెబుతున్నారు.