Begin typing your search above and press return to search.
సత్తెనపల్లిలో వైరస్ కలకలం ... హైదరాబాద్ నుండి తెచ్చిన శవానికి పాజిటివ్ !
By: Tupaki Desk | 3 Jun 2020 7:57 AM GMTఏపీలో రోజురోజుకి వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగి పోతుంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాను ఈ మహమ్మారి వణికిస్తోంది. వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో ఉన్న కేసులకు తోడు పొరుగు రాష్ట్రాల కేసులు భయపెడుతున్నాయి. హైదరాబాద్ లో మృతి చెందిన వ్యక్తికి సత్తెనపల్లిలో సోమవారం నాడు అంత్యక్రియలు నిర్వహించారు. కాగా అంత్యక్రియల తర్వాత కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే...
సత్తెనపల్లికి చెందిన ఓ కుటుంబం హైదరాబాద్ లో వ్యాపారం నిర్వహిస్తోంది. ఆ కుటుంబంలోని ఓ వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో హైదరాబాద్ లోని ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ సోమవారం చనిపోగా అంత్యక్రియల కోసం అదే రోజు రాత్రి సత్తెనపల్లికి తీసుకొచ్చారు. చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు అంబులెన్స్ ను అడ్డుకుని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షల అనంతరం మంగళవారం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించగా వారు అంత్యక్రియలు నిర్వహించారు.
మంగళవారం వైద్య పరీక్షల్లో మృతుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో బుధవారం ఉదయం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమై అంత్యక్రియలకు హాజరైన వారిని గుర్తించి హోం క్వారంటైన్‌కు తరలించారు. స్థానికంగానే పరీక్షలు నిర్వహించి కరోనా అనుమానం ఉన్నవారిని గుంటూరు కు తరలించనున్నారు. కరోనా నిర్ధారణ ఫలితానికి ముందే మృత దేహాన్ని అప్పగించడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.