Begin typing your search above and press return to search.
గాంధీ నుంచి డిశ్చార్జి 393.. ఇంటికి వెళ్లింది మాత్రం 310
By: Tupaki Desk | 9 Jun 2020 5:00 AM GMTపరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవటంలో తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రదర్శిస్తున్న చురుకుదనం అంతాఇంతా కాదు. మాయదారి రోగానికి సంబంధించిన కేసులు పెరిగిపోతున్న వేళ.. ఐసీఎంఆర్ తాజా గైడ్ లైన్స్ పేరుతో తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడో పట్టాన అర్థం కాని పరిస్థితి. పాజిటివ్ రోగుల్లో లక్షణాలు తక్కువగా ఉన్నవారు.. అస్సలు కనిపించని వారు.. జ్వరం రాని వారిని ఇంటికి పంపాలన్న నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. వారిని.. ఇంట్లోనే క్వారంటైన్ చేయాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా సోమవారం ఒక్కరోజే 393 మందిని డిశ్చార్జి చేసినట్లుగా గాంధీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం ప్రత్యేకంగా ఏసీ బస్సులతో పాటు.. మరికొన్ని వాహనాల్ని తీసుకొచ్చారు. సోమవారం సాయంత్రం నుంచి పాజిటివ్ రోజుల తరలింపు షురూ అయ్యింది. అయితే.. ఇలా తరలించిన వారిలో 310 మంది మాత్రమే ఇళ్లల్లోని క్వారంటైన్ సెంటర్లకు తరలించారు. మిగిలిన 83 మందిని అమీర్ పేటలోని ప్రకృతి చికిత్సాలయానికి తరలించారు. ఎందుకిలా? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలు బయటకువచ్చాయి.
గాంధీలో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. అక్కడ ఒత్తిడి తగ్గించుకునేందుకు వీలుగా.. మాయదారి రోగానికి సంబంధించిన స్వల్ప లక్షణాలు ఉన్న వారిని ఇంటికి పంపేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వారి ఇళ్లను అధికారులు పరిశీలించారు. రెండు బెడ్రూంలు ఉండటం.. ఇంట్లో వారు వేరుగా ఉండేందుకు అవసరమైన వసతులు ఉన్న వారిని ఇంటికి పంపేశారు. అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్న వారిని మాత్రం ఇళ్లకు పంపలేని పరిస్థితి.
అందుకే వారిని ప్రకృతి చికిత్సాలయానికి పంపి.. అక్కడ ట్రీట్ మెంట్ పూర్తిగా అయ్యాక మాత్రమే ఇంటికి పంపనున్నారు. ఇక.. ఇంట్లోని క్వారంటైన్ కు పంపిన వారి మీద అధికారుల పర్యవేక్షణ ఉంటుందని.. వారికేదైనా అత్యవసరమైనా.. అనారోగ్య పరిస్థితిని ఎదుర్కొంటున్నా.. ఫోన్ చేస్తే తగిన వైద్యాన్ని అందిస్తామని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు చెబుతున్నారు. మరీ. కొత్త పద్దతిలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్నది కాలమే చెప్పాలి.