Begin typing your search above and press return to search.
హైదరాబాదీకి బ్యాడ్ న్యూస్.. అది మాత్రం ఇప్పట్లో సాధ్యం కాదట
By: Tupaki Desk | 11 Jun 2020 12:30 AM GMTహైదరాబాదీకి కొత్త కష్టం ముంచుకొచ్చింది. ఓవైపు మాయదారి రోగం ఏ మూల నుంచి విరుచుకుపడుతుందో అర్థం కాని పరిస్థితి. మరోవైపు.. ఉద్యోగులు.. వ్యాపారులు.. ఇలా ప్రతి రంగానికి చెందిన వారు లాక్ డౌన్ కష్టాలకు గురి అవుతున్నారు. ఓపక్క కొలువులు పోతుంటే.. మరోపక్క వ్యాపారాలు సాగక కుదేలు అవుతున్నారు. గతం మరెప్పటికి మళ్లీ ఎప్పటికి సాధ్యమన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
మాయదారి రోగ భయంతో చోటు చేసుకున్న పరిణామాలు సగటు జీవికి గుదిబండలా మారాయి. రోజువారీ ఖర్చులకు కళ్లాలు వేసుకోలేకపోతే.. బతుకు బండిని లాగటం సాధ్యమయ్యేలా కనిపించని దుస్థితి. హైదరాబాద్ మహానగరంలో ఇంటికి.. ఉద్యోగం చేసే ప్రాంతానికి మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది.సొంత వాహనమో లేదంటే ప్రజారవాణా మీద ఆధారపడక తప్పని పరిస్థితి.
సొంత వాహనంలో ప్రయాణం చేయని లక్షలాది మందికి ఆదరువుగా నిలిచే నగర సిటీ బస్సులు.. ఇప్పట్లో రోడ్లు ఎక్కే అవకాశం కనిపించట్లేదు. మాయదారిరోగం అంతకంతకూ విస్తరిస్తున్న వేళ.. మహానగరంలో సిటీ సర్వీసులను స్టార్ట్ చేసే ఆలోచనను అధికారులు చేయట్లేదు. దీనికి తోడు జిల్లాల్లోని బస్సుల మాదిరి వీటికి డోర్లు ఉండకపోవటం.. ఒక బస్సులో పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రయాణికుల్ని ఎక్కించుకోవాలన్న నిబంధన హైదరాబాద్ లో సాధ్యం కాదు.
ప్రయాణికులు భౌతిక దూరాన్ని పాటించటం.. విధిగా మాస్కులు ధరిస్తారన్న గ్యారెంటీ లేని నేపథ్యంలో.. సిటీ సర్వీసుల్ని స్టార్ట్ చేయకపోవటమే మంచిదన్న ఆలోచనలో ఉన్నారు. అంతేకాదు.. హైదరాబాద్ నుంచి వరంగల్ లాంటి కొన్ని ప్రాంతాలకు బస్సుల్ని నడపకూడదని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో చౌకగా ప్రయాణాన్ని అందించే ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి లేకపోవటం నగరజీవికి శాపంగా మారనుంది. ఇప్పటికే తగ్గిన ఆదాయంతో కిందా మీదా పడుతున్న వారికి.. ఈ తరహా నిర్ణయాలతో ఖర్చు పెరిగే దుస్థితి. చూస్తుంటే.. ఈ సినిమా కష్టాలకు ఇప్పట్లో చెక్ పడేట్లుగా లేదని చెప్పక తప్పదు.