Begin typing your search above and press return to search.

చికిత్స అందక భార్య మృతి.. ఓ భర్త కన్నీటి గాథ..

By:  Tupaki Desk   |   21 Jun 2020 9:30 AM GMT
చికిత్స అందక భార్య మృతి.. ఓ భర్త కన్నీటి గాథ..
X
ఓ భర్త కన్నీటి గాథ ప్రతీఒక్కరి హృదయాలను కలిచివేస్తోంది. ఓ మహిళకు జ్వరంరాగా వైద్య సిబ్బంది కరోనా అని భావించి ఆమెను ఆస్పత్రిలో చేర్చుకోనేందుకు ముందుకు రాలేదు. దీంతో తన భార్యను బ్రతికించుకునేందుకు ఆమె భర్త నగరంలోని అన్ని పెద్ద ఆస్పతులకు తిరిగినా ఎక్కడా సరైన వైద్యం అందక మృతిచెందింది. ఈ సంఘటన రాష్ట్రంలోని ప్రస్తుతం దుస్థితిని నిదర్శనంగా కన్పిస్తుంది.

హైదరాబాద్లోని అత్తాపూర్ కు చెందిన శ్రీకాంత్ బీఎస్ఎన్ఎల్ లో పని చేస్తున్నారు. అతడికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. కాగా శ్రీకాంత్ భార్య(41)కు బుధవారం స్వల్ప జ్వరంరాగా స్థానిక ఆస్పత్రిలో చేర్పించాడు. అదేరోజు రాత్రి ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో శ్రీకాంత్ ఆమె భార్యను ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు ఆమెను చేర్చుకునేందుకు నిరాకరించారు. కరోనా రోగులకు బెడ్స్ లేవని చెప్పడంతో టెస్టు చేయకుండా మీరెలా నిర్ధారిస్తాడని ఆయన నిలదీశాడు. అనంతరం రోగికి కొద్దిసేపు ఆక్సిజన్‌ పెట్టి అక్కడి నుంచి పంపించారు.

దీంతో చేసేదేమీలేక ఆరోజు అర్ధరాత్రి తన భార్యను తీసుకొని నగరంలోని పలు ఆస్పత్రులకు తిరిగాడు. సుమారు 10ఆస్పత్రులకు తిరిగినా కూడా ఎక్కడా సరైన వైద్య అందించలేదని శ్రీకాంత్ ఆరోపించాడు. ప్రైవేట్ తోపాటు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు కూడా వైద్యం అందించలేదని వాపోయాడు. రాత్రి నుంచి తెల్లారిందాక తనను వివిధ ఆస్పత్రుల వెంట తిప్పారని తెలిపాడు. ఎక్కడ కూడా వైద్యం అందకపోవడతో చివరకు గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స చేస్తున్న క్రమంలో తన భార్య చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

తన భార్య కరోనా రోగి అంటూ ఆమెను ఆస్పత్రుల్లో చేర్పించుకోకపోవడం వల్లనే ఆమె మృతిచెందినట్లు ఆయన వాపోయాడు. ఈ సంఘటనపై శ్రీకాంత్ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశాడు. గతంలోనే రాష్ట్రంలో ఇలాంటి సంఘటన జరిగింది. గద్వాలలో ఓ గర్భిణీకి కరోనా ఉందంటూ ఆస్పత్రిలో చేర్చుకోకపోవడంతో తల్లిబిడ్డ మృతిచెందారు. ఈ రెండు సంఘటనలు చేస్తుంటే ప్రభుత్వం చెబుతున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో వైద్య సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుకు పొంతనలేదని అర్థం అవుతోంది. ప్రభుత్వం వైద్య సిబ్బందిపై పర్యవేక్షణ చేయకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే అభిప్రాయం వ్యకమవుతోంది. ఈ సంఘటనపై ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.