Begin typing your search above and press return to search.
తెలంగాణలో వైరస్ ఉధృతి: కొత్తగా 985 పాజిటివ్ - ఏడుగురు మృతి
By: Tupaki Desk | 27 Jun 2020 3:15 AM GMTవైరస్ వ్యాప్తి తెలంగాణ లో ఉధృతమవుతోంది. తాజాగా వెయ్యికి చేరువలో కేసులు నమోదవుతున్నాయి. టెస్టుల సంఖ్య పెంచుతున్న కొద్దీ కేసులు కూడా పెరుగుతున్నాయి. శుక్రవారం తెలంగాణ వైద్యారోగ్య శాఖ ప్రకటించిన హెల్త్ బులిటిన్ ప్రకారం.. 985 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒక్క రోజే 4,374 నమూనాలు పరీక్షించారు. వీటితోపాటు తాజాగా ఏడు మంది వైరస్ తో బాధ పడుతూ మృత్యు వాత పడ్డారు.
కొత్త కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 12,349కి చేరింది. మృతుల సంఖ్య 237. తాజాగా వైరస్ నుంచి కోలుకున్న వారు 78 మంది డిశ్చార్జయ్యారు. ఈ వైరస్ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య 4,766. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసులు 7,436.
ఈరోజు అత్యధిక కేసుల్లో జీహెచ్ఎంసీ ఉంది. తాజా కేసుల్లో 774 ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనివే. అనంతరం రంగారెడ్డిలో 86, మేడ్చల్ 53, వరంగల్ పట్టణ జిల్లాలో 20 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు చేసిన టెస్టులు 75,308.