Begin typing your search above and press return to search.
ఇంటర్ బోర్డులో మహమ్మారి కల్లోలం..18 మందికి పాజిటివ్!
By: Tupaki Desk | 2 July 2020 5:45 AM GMTతెలంగాణాలో మహమ్మారి విస్తరిస్తున్న తీరు చూస్తుంటే రోజురోజుకి ఆందోళన పెరిగిపోతుంది. ప్రతి రోజు కూడా దాదాపుగా వెయ్యి పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 800 కి పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. సామాన్యుల నుండి ప్రముఖల వరకు , అలాగే ప్రభుత్వానికి చెందిన పలు శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు కూడా దీని బారిన పడుతున్నారు. దీంతో నగరం లోని ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.
ఇకపోతే , తాజాగా ఈ వైరస్ ఇప్పుడు తెలంగాణ ఇంటర్ బోర్డును తాకింది. బోర్డు లోని పలువురు అధికారులకు వైరస్ సోకింది. దీనితో బోర్డులో పనిచేస్తున్న మిగతా ఉద్యోగులకు కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టుల్లో మరి కొంత మందికి వైరస్ పాజిటివ్ వచ్చింది. దీంతో ఇంటర్ బోర్డు లో మొత్తం 18 మంది కి వైరస్ పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ జరిగింది. ఈ నేపథ్యం లో బోర్డు కార్యాలయాన్ని అధికారులు శానిటైజ్ చేయిస్తున్నారు.