Begin typing your search above and press return to search.
ప్రగతి భవన్ లో మహమ్మారి కల్లోలం..5 మందికి పాజిటివ్!!
By: Tupaki Desk | 3 July 2020 4:45 AM GMTతెలంగాణలో వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. పేద, ధనిక ..చిన్నా , పెద్ద అనే తేడా లేకుండా వైరస్ స్వైరవిహారం చేస్తుంది.
ఈ మహమ్మారిని అరికట్టడానికి ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా మహమ్మారికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ముఖ్యంగా హైదరబాద్ లో మహమ్మారిను కట్టడి చేయలేకపోతున్నారు. GHMC పరిధి లో కేసులు రోజు రోజుకి తారా స్థాయికి చేరిపోతున్నాయి. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికై కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసినప్పటికీ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గటం లేదు.
సాధారణ ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం కరోనా భారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ లో వైరస్ కలకలం సృష్టిస్తోందని ప్రసారమాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ప్రగతి భవన్ లో పనిచేసే ఐదుగురు సిబ్బందికి పాజిటివ్ వచ్చినట్టు, దాని తో వెంటనే రంగం లోకి దిగిన వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు బాధితులను ఆస్పత్రికి తరలించి, ప్రగతి భావం మొత్తం శానిటైజేషన్ చేస్తునట్టు ప్రసారమాధ్యమాల్లో ఓ వార్త వైరల్ అవుతుంది. కాగా ముఖ్యమంత్రి గత నాలుగు రోజుల నుండి గజ్వెల్ లోని ఆయన నివాసం లోనే ఉంటున్నారు. అయితే , ప్రగతి భవన్ వైరస్ కలకలం పై ప్రభుత్వం నుండి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.