Begin typing your search above and press return to search.

తెలంగాణలో ఇన్ని టెస్టులకు అన్ని పాజిటివ్ లా?

By:  Tupaki Desk   |   4 July 2020 4:45 AM GMT
తెలంగాణలో ఇన్ని టెస్టులకు అన్ని పాజిటివ్ లా?
X
పక్కనున్న ఏపీలో రోజుకు 20వేల పైన కరోనా టెస్టులు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యకార్యకర్తలు అదే పనిగా పెట్టుకున్నారు. ఆ రాష్ట్రంలో రోజుకు 1000లోపే పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. దీనికి తెలంగాణ పూర్తి రివర్స్..

తెలంగాణలో కొత్తగా 1892 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎన్ని టెస్టులకో తెలిస్తే ముక్కున వేలేసుకుంటున్నారు. కేవలం 5965 టెస్టులకు మాత్రమే. అంటే అన్ని తక్కువ టెస్టులు.. ఇన్ని భారీ కేసులు నమోదయ్యాయంటే తెలంగాణలో కరోనా తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. శుక్రవారం 8మంది చనిపోయారు.

కాగా ప్రైవేట్ ల్యాబ్ లలో కరోనా టెస్టులు 3726 చేయగా.. అందులో 2672 పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీన్ని పరిగణలోకి తీసుకుంటే తెలంగాణలో పాజిటివిటీ రేటు ఏకంగా 71.1 శాతం ఉంది. ఇది ఇప్పటివరకు కరోనా నోటిఫైడ్ పాజిటివిటీ రేటులో అత్యధికం కావడం గమనార్హం. ఇంత ప్రబలంగా వ్యాపిస్తున్న కరోనా సమస్యపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రైవేట్ ఆస్పత్రులు నిజంగానే పాజిటివ్ గా తేల్చి చేస్తున్నాయా? లేక కరోనా కక్కుర్తిలో దోచుకుంటున్నాయా అన్న కోణంలో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఆరాతీస్తున్నట్టు తెలిసింది. తాజాగా 1892 పాజిటివ్ కేసులతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 20,462 కు చేరుకుంది.