Begin typing your search above and press return to search.

20 రోజుల్లో 3 లక్షల టెస్టులు .. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం !

By:  Tupaki Desk   |   11 July 2020 6:50 AM GMT
20 రోజుల్లో 3 లక్షల టెస్టులు .. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం !
X
తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగే విధానాన్ని ఒకసారి గమనిస్తే దేశంలో తెలంగాణ రాష్ట్రం కరోనాకి హాట్ స్పాట్ గా మారిందేమో అని అనిపించకమానదు. ఎందుకు అంటే .. గత కొన్ని రోజలు గా రాష్ట్రం లో నమోదు అవుతున్న కేసుల సంఖ్య ఆ విధంగా ఉంది. ప్రతి రోజు కూడా 1500 కేసులకు తగ్గకుండా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యం లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రం లో కేసులు భారీ గా పెరుగుతుండటం తో కరోనా లక్షణాలున్న వారిని త్వరగా గుర్తించాలని, దీని ద్వారా కరోనాను కట్టడి చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందు లో భాగం గానే వచ్చే 20 రోజుల్లో రాష్ట్రంలో దాదాపుగా 3 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.

దీని ప్రకారం ప్రతి రోజు 5 వేలకరోనా పరీక్షలు చేస్తారు. ప్రస్తుతం చేస్తున్న ఆర్టీ–పీసీఆర్‌ టెస్టు ద్వారా రోజుకు 5 వేలు, తాజాగా ప్రారంభిం చిన ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టుల ద్వారా రోజుకు 10 వేల కరోనా పరీ క్షలు చేయాలని నిర్ణయించినట్లు కరోనా నియంత్రణ ఉన్నతస్థాయి కమిటీ సభ్యుల్లో ఒకరు తెలిపారు. మొదట కేవలం 50 వేల యాంటిజెన్‌ కిట్లు మాత్రమే తెప్పించిన రాష్ట్ర ప్రభుత్వం, కేసుల సంఖ్య భారీ గా పెరుగుతుండటం తో మరో లక్షన్నర కిట్లను తెప్పించింది. ఇప్పటికే కేసుల సంఖ్య 30 వేలు దాటడం, ప్రతీ రోజూ దాదాపు 1,500 నుంచి 2 వేల మధ్య కొత్త పాజిటివ్‌ కేసులు వస్తుండటం తో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

వచ్చే రోజుల్లో ఆర్‌ టీ–పీసీఆర్‌ పరీక్షలను తక్కువ చేసి, యాంటిజెన్‌ పరీక్షలకే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో కరోనా అనుమానిత లక్షణాలున్న వారందరికీ యాంటిజెన్‌ పద్దతి లోనే ర్యాపిడ్‌ పరీక్షలు చేయాలని , అందు కోసం ప్రజల ఇంటి వద్దకే వెళ్లి పరీక్షలు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధి లో అన్ని ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. యాంటిజెన్‌ పరీక్ష ద్వారా కేవలం 15 నుంచి 30 నిమిషాల మధ్యే ఫలితం రానుంది. అంతేకాదు నమూనా ఇచ్చిన వెంటనే ఆ వ్యక్తిని అక్కడే ఉంచి ఫలితం 30 నిమిషాలలోపే చెప్పి పంపిస్తారు. పాజిటివ్‌ ఉండి, తీవ్రత ఎక్కువ గా ఉంటే ఆసుపత్రి కి రిఫర్‌ చేస్తారు.. లేకపోతె హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని చెప్తారు. ఇప్పటికే కరోనా నిర్దారణ పరీక్షలు చేస్తున్న ప్రైవేటు లేబరేటరీ లు కూడా ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు చేసుకోవచ్చని, దానికి ప్రత్యేక అనుమతి అవసరం లేదని అధికారులు చెబుతున్నారు