Begin typing your search above and press return to search.
గాంధీ ఆస్పత్రికి మరో గండం: ఆందోళనలో రోగులు
By: Tupaki Desk | 14 July 2020 8:45 AM GMTతెలంగాణలో వైరస్ ఆస్పత్రిగా హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రి మార్చారు. ఆ ఆస్పత్రిలో రోజురోజుకు పరిస్థితి దారుణంగా తయారవుతోంది. ఇప్పటికే వైరస్ బాధితులు పెద్దసంఖ్యలో చేరుతున్నారు. బెడ్లన్నీ నిండిపోతున్నాయి. వైద్యులు.. వైద్య సిబ్బంది.. పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవి భరించలేక ఇప్పటికే వైద్యులు.. జూనియర్ వైద్యులు ఆందోళన చేశారు. ఇప్పుడు తాజాగా మరొకరు ఆందోళన బాట పట్టారు. తమను రెగ్యులరైజ్ చేయాలని ఔట్ సోర్సింగ్ నర్సులు డ్యూటీలకు హాజరు కావడం లేదు. నాల్గో తరగతి ఉద్యోగులు మంగళవారం నుంచి ఆందోళనలోకి దిగారు. కొత్తగా తీసుకునే వాళ్లకు ఎక్కువ జీతం ఇస్తుండంతో.. తక్కువ జీతాలు పెంచాలంటూ నాలుగు రోజులుగా నర్సులు సమ్మె బాట పట్టారు.
వారి ఆందోళనతో గాంధీ ఆస్పత్రిలో ఆందోళనకర పరిస్థితులు పడ్డారు. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. జీతాలు పెంచుతామని హామీ ఇచ్చినా, 14 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు. నాల్గో తరగతి ఉద్యోగులు, స్వీపర్లు, వార్దు బాయ్‌లు, ఆయాలు కూడా ఆందోళన చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో గాంధీ ఆస్పత్రిలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. వైరస్ రోగులు చికిత్స పొందుతున్న పరిస్థితుల్లో అందరూ విధులు బహిష్కరించి ఆందోళన చేస్తే రోగులకే ప్రమాదంగా మారే అవకాశం ఉంది.