Begin typing your search above and press return to search.

కరోనాపై ఎట్టకేలకు స్పీడ్ పెంచిన కేసీఆర్ సర్కార్

By:  Tupaki Desk   |   17 July 2020 8:50 AM GMT
కరోనాపై ఎట్టకేలకు స్పీడ్ పెంచిన కేసీఆర్ సర్కార్
X
కరోనా టెస్టులు చేయకపోవడం.. బులిటెన్ లోనూ సరైన వివరాలు చూపకపోవడం.. పెద్ద సంఖ్యలో జనాలు కరోనా టెస్టుల కోసం హైదరాబాద్ లో అవస్థలు పడుతుండడంతో ఎట్టకేలకు కేసీఆర్ సర్కార్ గేర్ మార్చింది. తెలంగాణ వైద్యశాఖను ప్రక్షాళన చేసిన కేసీఆర్ సర్కార్.. ఇక కొత్త అధికారులను నియమించి వైద్యవ్యవస్థలో స్పీడ్ పెంచారు.

ఓవైపు హైకోర్టు హెచ్చరికలు.. జనాల హాహాకారాలు.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. ర్యాపిడ్ యాంటిజెన్ కిట్స్ ను పెద్ద ఎత్తున తెప్పించి రోజుకు పదివేలకు పైగానే టెస్టులు చేస్తోంది.

ఇక తెలంగాణ హెల్త్ బులిటెన్ రూపురేఖలు పూర్తిగా మార్చేసింది. హైకోర్టు చెప్పినట్టు ఏ వార్డులో ఎంతమందికి కరోనా సోకింది? ఏ ఆస్పత్రిలో ఎన్ని బెడ్స్ ఉన్నాయి..? సమగ్ర వివరాలతో బులిటెన్ రిలీజ్ చేస్తోంది. నిన్నటి నుంచి ఈ మార్పు కనిపిస్తోంది. తెలంగాణలో కరోనా కేంద్ర ఆస్పత్రి గాంధీలో అందుబాటులో ఉన్న బెడ్స్ తోపాటు తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ కరోనా టెస్ట్ సెంటర్స్ ఇలా అన్ని వివరాలను బులిటెన్ లో పొందుపరుస్తోంది.

ఇలా చుట్టుముడుతున్న కరోనా వైఫల్య విమర్శలతో కేసీఆర్ సర్కార్ పూర్తిగా ప్రక్షాళన చేసి మార్చేసింది. నిన్నటి తాజా బులిటెన్ చూస్తే అర్థమవుతోంది. ఏకంగా నిన్న ఒక్కరోజే 14వేల టెస్టులకు పైగా చేయడం గమనార్హం. నిన్న 1676 పాజిటివ్ కేసులు బయటపడగా.. మొత్తం కేసుల సంఖ్య 41వేలకు చేరింది.