Begin typing your search above and press return to search.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో విజృంభిస్తున్న మహమ్మారి
By: Tupaki Desk | 20 July 2020 8:50 AM GMTమహమ్మారి వైరస్ కేసులు తెలంగాణలో 45 వేలు దాటాయి. ఇన్నాళ్లు గ్రేటర్ హైదరాబాద్‌లో తీవ్రంగా ప్రబలిన వైరస్ ఇప్పుడు జిల్లాల్లో విజృంభణ మొదలుపెట్టింది. జిల్లాలకు ఆ వైరస్ పాకుతోంది. ఈ క్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అధికంగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఆ ఐదు జిల్లాల్లో మొత్తం కేసుల సంఖ్యం 800 దాటింది. నారాయణ పేట జిల్లా మినహా మిగతా నాలుగు జిల్లాల్లో పంజా విసురుతోంది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను ఐదు జిల్లాలుగా చేశారు. నారాయణపేట.. నాగర్‌కర్నూల్.. మహబూబ్‌నగర్.. జోగులాంబ గద్వాల.. వనపర్తి జిల్లాలు ఉండగా ఈ జిల్లాల్లో వైరస్ వ్యాప్తి తీవ్ర రూపం దాలుస్తోంది. ఈ ఆదివారం ఒక్కరోజే ఉమ్మడి జిల్లాలో 40 కేసులు నమోదయ్యాయని వైద్య శాఖ వెల్లడించింది. ఈ తాజా కేసులతో కలిపి ఉమ్మడి జిల్లాల్లో మొత్తం కేసుల సంఖ్యం 800 దాటింది.
నారాయణపేట జిల్లాలో ఆదివారం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటుండడంతో వైరస్ కట్టడిలో ఉంది. ముఖ్యంగా మక్తల్ నియోజకవర్గంలో పరిస్థితి ఆశాజనకంగా ఉంది. మక్తల్ లో తక్కువ సంఖ్యలో కేసులు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 12,224 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో 32,438 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.