Begin typing your search above and press return to search.
కరోనాతో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి .. ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్!
By: Tupaki Desk | 30 July 2020 6:30 AM GMTకరోనాతో ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించారు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురు చనిపోవడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఒకవైపు అయిన వారంతా కళ్లముందే కన్నుమూస్తుంటే...మరోవైపు ఆస్పత్రుల ధనదాహానికి కుటుంబం మొత్తం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైద్రాబాద్ పట్టణానికి చెందిన సత్యనారాయణ రెడ్డి కుటుంబంలో ముగ్గురు కరోనాతో మరణించారు. సత్యనారాయణ రెడ్డి కుటుంబం , అయన ఆయన సోదరుడి కుమారుడు అడ్వకేట్ అన్‌రెడ్డి హరీష్ రెడ్డి ఫ్యామిలీ చంపాపేటలోని ఆర్టీసీ కాలనీ , రెడ్డికాలనీ లో ఉంటున్నారు.
ఈ మధ్య వీరందరూ ఓ భూ వివాదానికి సంబంధించి ఒకే కారులో స్థానికంగా ఉన్న ఓ పోలీస్‌స్టేషన్ కు వెళ్లి వచ్చారు. ఆ తర్వాతి మూడురోజులకే అడ్వకేట్ హరీష్ రెడ్డికి శ్వాస సంబంధ సమస్యలు తలెత్తడటం తో టెస్టు చేపించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే ఆయన భార్య, ఐదేళ్ల కూతురికి కూడా పాజిటివ్ వచ్చింది. బాబాయ్ సత్యనారాయణ రెడ్డి, పిన్ని సుకుమారి, వారి 21 ఏళ్ల కుమారుడికి కూడా వైరస్ నిర్ధారణ అయింది. అడ్వకేట్ హరీష్ రెడ్డికి కరోనా తీవ్రత ఎక్కువ కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఈ నెల 23న కన్నుమూశారు. అయన చికిత్స కోసం రూ.16 లక్షల వరకు ఖర్చు పెట్టారు. కానీ , అడ్వకేట్ హరీష్ రెడ్డిని బ్రతికించుకోలేకపోయారు.
ఇక హరీష్ రెడ్డి బాబాయ్ సత్యనారాయణరెడ్డి, పిన్ని సుకుమారికి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. జూలై 10న వారిద్దరు చికిత్స కోసం తొలుత సోమాజిగూడలోని డెక్కన్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. అయితే , అక్కడి నుండి రెండ్రోజులకె డిశ్చార్జ్ అయి హోం ఐసోలేషన్ కు వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన రెండ్రోజులకే సత్యనారాయణరెడ్డి తీవ్ర ఆయాసం, జ్వరంతో బాధపడుతుండటంతో ఆయన్ను చికిత్స కోసం జూలై 15న మళ్లీ ఇదే ఆస్పత్రిలో చేర్పించారు. తర్వాత ఆయన భార్యకు కూడా శ్వాస సమస్యలు తలెత్తాయి. అయితే ,డెక్కన్ ఆస్పత్రి బెడ్ లేదని చెప్పడంతో .. తెలిసిన వైద్యుడి సహాయంతో ఆమె గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం మృతి చెందగా, డెక్కన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె భర్త సత్యనారాయణరెడ్డి కూడా బుధవారం మృతి చెందారు. పది రోజులకు రూ.17.50 లక్షల బిల్లు వేశారు. ఇప్పటికే రూ.8 లక్షలు చెల్లించారు, మిగిలిన బిల్లు చెల్లిస్తేనే శవాన్ని ఇస్తామని హాస్పిటల్ యాజమాన్యం కుటుంబ సబ్యులని బెదిరించారు. దీనిపై సత్యనారాయణరెడ్డి కుమారుడు మీడియా ద్వారా పోలీసులని , ప్రభుత్వాన్ని ఆశ్రయించడం తో శవాన్ని అప్పగించారు. దీనిపై సత్యనారాయణరెడ్డి కుమారుడు మాట్లాడుతూ .. నేను పడిన కష్టం ఎవరికీ రాకూదని , కరోనా పేషేంట్ అని తెలిసినా కూడా డబ్బుల కోసం నన్ను చాలా హింసించారు అని తెలిపారు. అలాగే ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ కి తెలిపాడు. దీనిపై స్పందించిన మంత్రి .. హాస్పిటల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాంటి ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఈటలను కోరారు.