Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందని కేటీఆర్ అడిగితే.. వారేం చెప్పారు?
By: Tupaki Desk | 5 Aug 2020 7:10 AM GMTవారేమీ మామూలోళ్లు కాదు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు వ్యాక్సిన్ డెవలప్ చేస్తున్న ప్రముఖ కంపెనీలకు.. సంస్థలకు చెందిన అత్యంత కీలకమైన వ్యక్తులు. రానున్న రోజుల్లో వారిదే హవా. అంతకు మించి.. వ్యాక్సిన్ల తయారీలో మంచి పట్టు ఉండటంతో పాటు.. అనుభవం కూడా ఎక్కువే. అలాంటి వారు కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందన్న మాటను నేరుగా అడగటమే కష్టం. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ లాంటి వారికి మాత్రమే ఇలాంటి సాధ్యం. తాజాగా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందన్న ప్రశ్న పలువురిని తొలిచేస్తున్న వేళ.. ప్రజల తరఫున ప్రశ్నను అడిగిన కేటీఆర్ పుణ్యమా అని.. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందన్న అంశంపై ఒక క్లారిటీ వచ్చేసిందని చెప్పాలి.
ఇంతకీ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందని మంత్రి కేటీఆర్ అడిగిన ప్రముఖులు ఎవరంటారా? అక్కడికే వస్తున్నాం. వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలకభూమిక పోషిస్తున్న భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా.. ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ ఎండీ డాక్టర్ ఆనంద్ కుమార్, బయలాజికల్ -ఈ ఎండీ మహిమ దాట్ల.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ (ఈమె జెనీవాలో ఉన్నారు. అక్కడి నుంచి వెబినార్ లో పాల్గొన్నారు) లు ఒకే వేదికను పంచుకున్నారు. వెబినార్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మోడరేటర్ గా వ్యవహరించారు.
వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందన్న సూటి ప్రశ్నకు ప్రముఖులు ఎవరేం చెప్పారన్న విషయం చూస్తే.. ఎప్పటికి వ్యాక్సిన్ వస్తుందన్న అసలు విషయంపై పూర్తిస్థాయి అవగాహన కలగటం ఖాయం. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందన్న కేటీఆర్ మాటకు ముగ్గురు ప్రముఖులు వేర్వేరుగా సమాధానం చెప్పటం గమనార్హం. భారత్ బయోటెక్ కృష్ణ ఎల్లా వచ్చే ఏడాది చివరి నాటికి పది నుంచి పదిహేను వ్యాక్సిన్లు వస్తాయని చెప్పారు. అదే సమయంలో.. మొదటి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందన్న విషయాన్నిమాత్రం ప్రస్తావించకపోవటం గమనార్హం. ఇక.. బయలాజికల్ - ఈ ఎండీ మహిమ దాట్ మాత్రం వచ్చే ఏడాది జనవరి నుంచి జూన్ మధ్యలో ఐదు వ్యాక్సిన్లు వచ్చే వీలుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక.. ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ ఎండీ డాక్టర్ ఆనంద్ మాత్రం.. వచ్చే ఏడాది జూన్ నుంచి సెప్టెంబరు నాటికి వ్యాక్సిన్ వస్తుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అయితే.. తాము తయారు చేసిన వ్యాక్సిన్ ను ఒకసారి వాడితే సరిపోతుందన్న మాటను ఆయన చెప్పటం గమనార్హం.
ఈ ముగ్గురు చెప్పిన అభిప్రాయాల్ని చూస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనే వచ్చే ఏడాది మొదట్లో వ్యాక్సిన్ వచ్చే అవకాశం తక్కువనే చెప్పాలి. వీరి మాటల సారాంశాన్ని కలిపితే.. అర్థమయ్యేదేమంటే.. వచ్చే ఏడాది మార్చి.. ఏప్రిల్ నాటికి మొదటి వ్యాక్సిన్ వచ్చే వీలుంది. అది మనవరకు చేరేసరికి వచ్చే ఏడాది దసరా నాటికి వచ్చినా ఆశ్చర్యం చెందాల్సిన అవసరం లేదని చెప్పాలి. ఒక నెల అటు ఇటుగా 2021 మధ్యంతరానికి వచ్చే వీలుందని చెప్పక తప్పదు.