Begin typing your search above and press return to search.

తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గుతోందా?

By:  Tupaki Desk   |   17 Aug 2020 7:50 AM GMT
తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గుతోందా?
X
దేశమంతా కరోనామయం.. రాష్ట్రాలు అందులో భాగస్వామ్యం. కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా కల్లోలం చోటుచేసుకుంటోంది.. ఏపీలో రోజుకు 10వేల కేసుల వరకు నమోదవుతున్నాయి. తెలంగాణలో 2 వేలకు తగ్గడం లేదు. అయితే అనూహ్యంగా తెలంగాణలో కేసులు తగ్గుముఖం పట్టడం ప్రజలు, అధికారులకు ఊరట కలిగిస్తోంది.

తెలంగాణలో హైకోర్టు ఆదేశాల మేరకు టెస్టుల సంఖ్యను పెంచారు. అయినా కూడా కేసుల సంఖ్య తగ్గిపోవడం శుభపరిణామంగా చెప్పవచ్చు. ముఖ్యంగా వందల కేసులు నమోదవుతున్న హైదరాబాద్ లో సడన్ గా కేసులు తగ్గడం ఊరటగా చెప్పవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ లో రోజుకు 200-400 కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. ఇతర జిల్లాల్లోనూ తగ్గుముఖం పడుతున్నాయి.తెలంగాణలో ఇప్పుడు 1000 కేసులకు దగ్గరగా నమోదవుతున్నాయి.

ఇక అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మరణాల సంఖ్య తక్కువగా నమోదు కావడం గొప్ప ఊరటగా చెప్పవచ్చు.తెలంగాణలో నిన్న 9 మంది మాత్రమే మరణించడం గొప్ప ఊరటగా చెప్పవచ్చు. ఇక కేసులు కూడా లక్షలోపే ఉన్నాయి. నిన్న 1102 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

అయితే తాజా గణాంకాల ప్రకారం.. మొత్తం కోవిడ్ కేసులలో ఐదో వంతు ఐసియూ చికిత్స కు వెళుతుండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్ వల్ల తలెత్తిన ఇతర ఆరోగ్య సమస్యలే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. కొంతమందికి రోగనిరోధక శక్తి సమస్యలు, బలం లేకపోవడం, ఇంకా చాలా మంది ఇతర సమస్యలతో ఐసీయూలో చేరే రోగుల సంఖ్య మాత్రం పెరుగుతోంది.

కరోనా భయంతోపాటు తాజాగా తెలంగాణలో భారీ వర్షాల కారణంగా జనమంతా ఇంటికే పరిమితమయ్యారు. అందుకే కరోనా కూడా వ్యాప్తి తగ్గి కంట్రోల్ లోకి వచ్చినట్టు తెలుస్తోంది.