Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో చేయని సాహసాన్ని వరంగల్ లో చేసిన కేటీఆర్
By: Tupaki Desk | 19 Aug 2020 7:50 AM GMTవినూత్నంగా వ్యవహరించారు మంత్రి కేటీఆర్. వరద కారణంగా అతలాకుతలమైన వరంగల్ మహానగరాన్ని పర్యటించిన ఆయన.. అనూహ్యంగా వ్యవహరించారు. నిత్యం హైదరాబాద్ లోని పలు కార్యక్రమాలకు హాజరయ్యే ఆయన.. ఏ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోవిడ్ ఆసుపత్రి.. అదేనండి గాంధీ దవాఖానాను సందర్శించింది లేదు. ఈ మధ్యన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.. గాంధీ ఆసుపత్రిని సందర్శించటమే కాదు.. కోవిడ్ రోగులు ఉన్న వార్డుల్లోకి వెళ్లి.. అక్కడి పరిస్థితుల్ని పరిశీలించటం తెలిసిందే.
ఆ తర్వాత అధికారపార్టీలో కాస్త చలనం వచ్చి.. వారు సైతం ఆసుపత్రి లోపలకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే.. మంత్రి కేటీఆర్ మాత్రం వరంగల్ పర్యటన సందర్భంగా కోవిడ్ కేసులకు చికిత్స అందించే ఎంజీఎంకు వెళ్లారు. పీపీఈ సూట్లు ధరించి మరీ.. కోవిడ్ వార్డుల్లోకి వెళ్లి.. అక్కడి పేషెంట్లను పరామర్శించారు. మంత్రి కేటీఆర్ స్వయంగా ఆసుపత్రికి రావటంతో సందడి వాతావరణం నెలకొంది.
ఇక.. కోవిడ్ వార్డుల్లోకి వెళ్లిన మంత్రి కేటీఆర్.. అక్కడి పేషెంట్లను వైద్యం ఎలా సాగుతుందన్న విషయాన్ని అడిగి తెలుసుకోవటంతో పాటు.. వైద్యం ఎలా చేస్తున్నారని అడిగారు. చికిత్స పొందుతున్న పలువురితో స్వయంగా మాట్లాడారు. దాదాపు నలభై ఐదు నిమిషాలు ఆసుపత్రిలోనే గడిపారు. ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలన్న మాట మాత్రమే కాదు..తన ఫోన్ నెంబరుకు కూడా ఇవ్వటం గమనార్హం.
పలువురు వైద్యులు సరిగా వైద్యం చేయటం లేదని మరో మంత్రి ఎర్రబెల్లి కేటీఆర్ కు ఫిర్యాదు చేయగా.. హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి వైద్యులు బాగా పని చేస్తున్నారని.. మరిక్కడ సమస్య ఏమిటని వైద్యుల్ని ప్రశ్నించారు. ఎంజీఎంలో ఇప్పుడున్న 250 పడకలకు అదనంగా మరో 150 పడకల్ని తక్షణం పెంచనున్నట్లుగా వెల్లడించారు. అయితే.. ఈ ప్రకటనను మంత్రి ఈటెలతో కలిసి కేటీఆర్ ప్రకటించటం విశేషం.
మంత్రిగా వ్యవహరిస్తూ.. తనకేమాత్రం సంబంధం లేని వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన నిర్ణయాన్ని.. ఆ శాఖను చూసే మంత్రి ఈటెల కాకుండా.. కేటీఆర్ ప్రకటించటం ఆసక్తికరంగా మారినట్లు ఎంజీఎం వైద్యులు వ్యాఖ్యానిస్తున్నారు. హైదరాబాద్ లో గాంధీ ఆసుపత్రి.. కింగ్ కోఠి.. చెస్టు.. ఇలా పలు ఆసుపత్రులు కోవిడ్ వైద్యం చేస్తున్నా.. పీపీఈ కిట్లు ధరించి.. రోగుల్ని పరామర్శించని మంత్రి కేటీఆర్.. వరంగల్ లో మాత్రం అందుకు భిన్నంగా చేసిన సాహసం అక్కడి వారిని ఎంతగానో ఆకర్షించినట్లుగా చెబుతున్నారు.