Begin typing your search above and press return to search.

రూల్స్ ప్రజలకేనా, కరోనా నిబంధనలను లెక్క చేయని తెలంగాణ మంత్రి !

By:  Tupaki Desk   |   26 Aug 2020 12:50 PM GMT
రూల్స్ ప్రజలకేనా, కరోనా నిబంధనలను లెక్క చేయని  తెలంగాణ మంత్రి !
X
కరోనా మహమ్మారి భయపెడుతోంది. జనాన్ని అనవసరంగా బయటకు రావొద్దని, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలని, పేస్ మాస్క్ లు పెట్టుకోవాలని ప్రభుత్వాలు ఊదరగొడుతున్నాయి. కానీ, అవేవీ తెలంగాణలోని ప్రజాప్రతినిధులు మాత్రం కరోనా రూల్స్ బేఖాతరు చేస్తున్నారు. తెలంగాణలోని ప్రజాప్రతినిధులకు పట్టినట్టు లేదు. జనానికి చెప్పాల్సిన వారే పార్టీల్లో మునిగితేలిపోతున్నారట. ఇది చూసిన వారు ముక్కున వేలేసుకొంటున్నారు. ప్రజలకు జాగ్రత్తలు చెప్పి, మీరే ఇలా చేస్తే ఎలాగంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. ముఖ్యంగా కరోనా తెలంగాణ లో రోజురోజుకి ఎక్కువగా విజృంభిస్తుంది. సామాన్యులతో పాటుగా ప్రముఖులు , ఎమ్మెల్యేలు , పలువురు ప్రజాప్రతినిధులు కూడా కరోనా భారిన పడుతున్నారు. అయినా కూడా ఇంకా కొంతమంది కరోనా నిబంధనలు పాటించడం లేదు. ఎదో చదువుకొని వారో , సామాన్య ప్రజలో కరోనా రూల్స్ బ్రేక్ చేస్తున్నారు అంటే ఏమో అనుకోవచ్చు కానీ , ప్రజలకి చెప్పాల్సిన స్థానంలో ఉన్న ఎమ్మెల్యేలు , మంత్రులు కూడా కరోనా నిబంధనలు పాటించడం లేదు.

ఇకపోతే తాజా పర్యటన లో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాస్క్ ధరించకపోవడం పై విమర్శలు వస్తున్నాయి. తాజాగా సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లా లో పర్యటించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాస్కులు లేకుండానే తిరిగారు. అలాగే కొండ పోచమ్మ సాగర్ జలాశయంలో చేపలు వదిలేటప్పుడు, పశువులకు ఉచిత కృత్రిమ గర్భధారణ శిబిరాన్ని ప్రారంభించిన సమయంలో వందల మంది మధ్య మాస్కు తో పాటు భౌతిక దూరాన్ని కూడా లెక్కచేయలేదు. దీనితో కరోనా వైరస్ నిబంధనలు లీడర్లకు వర్తించవా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాగే వ్యవహరించి ఇప్పటికే ఓ ప్రజాప్రతినిధి కరోనా భారిన పడిన విషయం తెలిసిందే. అప్పుడు కేటీఆర్ కూడా దానిపై స్పందించారు. కాబట్టి నలుగురికి చెప్పే హోదాలో ఉన్నారు కాబట్టి .. ముందు వారు పాటించి ఆ తరువాత ప్రజలకి చెప్పడం మంచింది అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఇకపోతే , తెలంగాణలో వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 3,018 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, అదే సమయంలో పది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,688 కి చేరింది. ఆసుపత్రుల్లో 25,685 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 85,223 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 780కి చేరింది.