Begin typing your search above and press return to search.

తాజా సర్వే ఇచ్చిన షాక్.. లక్షణాలు లేకున్నా.. మస్తుగా వైరస్ లోడ్

By:  Tupaki Desk   |   21 Sep 2020 5:45 AM GMT
తాజా సర్వే ఇచ్చిన షాక్.. లక్షణాలు లేకున్నా.. మస్తుగా వైరస్ లోడ్
X
కరోనా నేపథ్యంలో పలు సంస్థలు పలు విధాలుగా పరిశోధనలు చేస్తున్నాయి. తాజాగా అలాంటి సర్వే ఒకటి బయటకు రావటమే కాదు.. గుండెలు అదిరే విషయాల్ని వెల్లడించింది. హైదరాబాద్ కు చెందిన సెంటర్ ఫర్ డీఎన్ ఏ ఫింగర్ ప్రింట్స్ ఒక సర్వేతో పాటు.. అధ్యయనాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటివరకు 57వేల మంది వైరస్ బారిన పడితే.. అందులో 70 శాతం మందికి ఎలాంటి లక్షణాలు కనిపించలేదని.. కేవలం 30 శాతం మందిలోనే జ్వరం.. దగ్గు.. జలుబు లాంటి లక్షణాలు కనిపించినట్లుగా తేల్చారు. షాకింగ్ నిజం ఏమంటే.. కోవిడ్ లక్షణాలు ఉన్న వారితో పోలిస్తే.. ఎలాంటి వైరస్ లక్షణాలు లేని వారిలో వైరస్ లోడ్ భారీగా ఉన్న విషయాన్ని గుర్తించినట్లు వెల్లడించారు. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వల్ల వైరస్ లోడ్ ఉన్నప్పటికీ.. ఆ విషయం బయటకు రాలేదన్న విషయాన్ని గుర్తించారు.

వీరి కారణంగానే పెద్ద వయస్కులు.. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు.. పిల్లలకు వైరస్ వ్యాప్తి చెందుతోందని.. పరోక్షంగా పలువురి మరణాలకు కారణమవుతున్నట్లుగా తేల్చారు. ఈ సంస్థ చేసిన పరిశోధన వివరాల్ని బయో ఆరెక్సీవ్ లో ఇటీవల పబ్లిష్ అయ్యాయి. గ్రేటర్ పరిధిలోని వైరస్ బారిన పడిన వారిలో అత్యధికులు 20బిక్లేడ్ అనే స్ట్రెయిన్ కు చెందిన వైరస్ ఉన్నట్లుగా తేల్చారు.

అతి తక్కువ మందిలోనే ఇతర స్ట్రెయిన్ లకు చెందిన వైరస్ లు ఉన్నట్లుగా తేల్చారు. కేసుల నమోదైన తొలినాళ్లలో రెండు మూడు రకాల వైరస్ లు నిర్దారణ కాగా.. మే.. జూన్ లలో మాత్రం బిక్లేడ్ స్ట్రెయిన్లతో కూడిన కేసులు నమోదైనట్లుగా తేల్చారు. ఇదంతా చూస్తే.. ఇప్పటివరకూ వైరస్ బారిన పడని వారిలో చాలామందిలో వైరస్ లోడ్ ఉండదన్న విషయం ఆందోళనకు గురి చేయటం ఖాయమని చెప్పక తప్పదు.