Begin typing your search above and press return to search.

తెలంగాణలో 70 శాతం మందికి వైరస్ వచ్చి పోతున్నదే తెలీదట

By:  Tupaki Desk   |   10 Nov 2020 6:00 AM GMT
తెలంగాణలో 70 శాతం మందికి వైరస్ వచ్చి పోతున్నదే తెలీదట
X
ఆసక్తికర అంశం వెలుగు చూసింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మాయదారి.. తెలంగాణలో మాత్రం దాని యాంటీబాడీస్ అంతకంతకూ పెరుగుతున్న విషయాన్ని తాజాగా గుర్తించారు. కరోనా వైరస్ ను తట్టుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్న విషయం ఎన్ఐఎన్ రెండు దశల్లో నిర్వహించిన సర్వేల్లో వెల్లడైనట్లు పేర్కొన్నారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో రెండు దఫాల్లో నిర్వహించిన సర్వేలో 12 నుంచి 18 శాతం మందిలో యాంటీబాడీలు పెరుగుతున్న విషయాన్ని గుర్తించారు.

దాదాపు 70 శాతం మందిలో అసలు కరోనా వచ్చి పోయిన విషయమే తెలీదని చెబుతున్నారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి ఏ రీతిలో ఉంది? అయా వయస్కుల వారిపై ప్రభావం ఏమిటి? ప్రజల్లో యాంటీ బాడీలు ఎలా డెవలప్ అవుతున్నాయి అన్న అంశాలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. మే.. ఆగస్టు రెండు నెలల్లో జనగామ.. కామారెడ్డి.. నల్గొండ జిల్లాల్లోని వివిధ వయసులో ఉన్న వారిని ఎంపిక చేశారు.

మొత్తం 30 గ్రామాల్లో ఈ శాంపిల్ నిర్వహించారు. ప్రతి గ్రామంలోనూ ర్యాండమ్ గా పదహారు ఇళ్లను గుర్తించి.. వారి నుంచి రక్తం శాంపిళ్లను సేకరించారు. అందులో సీరమ్ నువేరు చేసి కొవిడ్ యాంటీబాడీలను గుర్తించటానికి చెన్నైలోని ఐసీఎంఆర్ కు పంపగా.. నూటికి 12 శాతం మందిలోయాంటీబాడీలు ఉన్నట్లుగా చెబుతున్నారు. జనగామలో అత్యధికంగా 18 శాతం యాంటీబాడీలు ఉన్నట్లు తేలితే.. కామారెడ్డిలో ఏడు శాతం.. నల్గొండలో 11 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ సర్వేలో అన్ని వయస్కుల వారు ఉన్నారు. ఇలా తేలిన వారిలో 70 శాతం మందికి తమకు కరోనా వచ్చి వెళ్లిపోయిన విషయం కూడా తెలీదని చెప్పటం ఆసక్తికరంగా మారింది. త్వరలో మూడో దశ సర్వేను నిర్వహించనున్నారు.