Begin typing your search above and press return to search.
చాలా రోజుల తర్వాత తెలంగాణలో అతి తక్కువ కేసులు
By: Tupaki Desk | 16 Nov 2020 7:50 AM GMTప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. సెకండ్ వేవ్ వార్తలు ఇప్పటికే ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా.. యూరప్ దేశాల్లో నిత్యం వేలాది కేసులు నమోదవుతున్నాయి. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉన్న పరిస్థితి. మన దేశంలోనూ ఢిల్లీ.. కేరళ రాష్ట్రాల్లోనూ సెకండ్ వేవ్ ఛాయలు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి వేళలో తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ తక్కువగా నమోదవుతున్నాయి.
ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో కేవలం 502 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. వీటిల్లోనూ తీవ్రత ఉన్న వారుచాలా తక్కువగా ఉందంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17296 కరోనా పరీక్షలు నిర్వహించగా.. చాలా తక్కువ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేవలం 141 కేసులు మాత్రమే నమోదయ్యాయి.
కరోనా కేసుల నమోదు పెరిగిన తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదు కావటం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. మరోవైపు.. వరుసగా వచ్చిన పండుగ సెలవుల కారణంగా తక్కువ కేసులు నమోదైనట్లుగా చెబుతున్న వాదనలోనూ పస లేదంటున్నారు. దీనికి కారణం.. మొత్తం 17వేల పరీక్షలుచేస్తే.. అందులో 500 పాజిటివ్ కేసుల అంటే.. చాలా తక్కువగా చెబుతున్నారు. గతంతో పోలిస్తే.. రోడ్ల మీద రద్దీ పెరగటం.. ప్రయాణాలు భారీగా జరుగుతున్న వేళలోనూ.. కేసుల నమోదు తగ్గటం ఉపశమనంగా మారిందని చెప్పక తప్పదు. అయితే.. తక్కువ కేసులునమోదు అవుతున్నాయని చెప్పి.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించక తప్పదంటున్నారు.