Begin typing your search above and press return to search.
ఆశ్చర్యానికి గురి చేసేలా తెలంగాణలో కరోనా కేసులు
By: Tupaki Desk | 23 Nov 2020 7:15 AM GMTఓవైపు ఢిల్లీ.. మరోవైపు కేరళతో పాటు.. మధ్యప్రదేశ్.. గుజరాత్ లతో సహా పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల నమోదు అంతకంతకూ పెరుగుతున్న వేళ.. అందుకు భిన్నమైన పరిస్థితి తెలంగాణలో ఉంది. లాక్ డౌన్ కు ముందు హైదరాబాద్ మహా నగరంలో ఎలాంటి పరిస్థితి ఉందో.. ఇంచుమించు ఇప్పుడు అలాంటి స్థితే ఇప్పుడుంది. థియేటర్లు.. మల్టీఫ్లెక్సులు లాంటివి కొన్నింటిని మినహాయిస్తే.. రోడ్ల మీద ట్రాఫిక్ జాంలు.. మార్కెట్లు రద్దీతో కనిపిస్తున్నాయి. ఇలాంటివేళ.. కరోనా కేసుల నమోదు మరింత పెరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
ఇలాంటివేళ.. నమోదవుతున్న కేసుల సంఖ్య ఆశ్చర్యకరంగా ఉంటున్నాయి. అలా అని నిర్దారణ పరీక్షలు తక్కువ చేస్తున్నారంటే అదీ లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం ప్రతి పది లక్షల మంది జనాభాకు 5600 చొప్పున పరీక్షలు చేస్తున్నారు. ఆదివారం చేసిన పరీక్షలు 24,139 చేయగా.. పాజిటివ్ కేసులు 602గా నమోదయ్యాయి. కొన్ని నెలల తర్వాత.. రోజులో కొత్త కేసులు నమోదు నాలుగు అంకెల నుంచి మూడు అంకెలకు తగ్గటం ఇప్పుడేనని చెబుతున్నారు.
ఇక.. ఆదివారం కోలుకున్న వారి సంఖ్య 1015 కావటం గమనార్హం. హైదరాబాద్ విషయానికి వస్తే.. 130 కేసులు మాత్రం నమోదయ్యాయి.ఇంత పెద్ద ఎత్తున ప్రయాణాలు.. ఎన్నికల ప్రచారాలు.. రద్దీ నెలకొన్న ఈ సమయంలో కేసుల నమోదు తక్కువగా ఉండటం ఆసక్తికరంగా మారింది. అయితే.. ఈ నెలాఖరు వరకు ఇలాంటి పరిస్థితే నెలకొంటే.. సెకండ్ వేవ్ తీవ్రత పెద్దగా ఉండకపోవచ్చంటున్నారు. మరో వాదన ప్రకారం.. డిసెంబరు 15 నాటికి ఇప్పుడు మాదిరే తక్కువ కేసులు నమోదైతే.. కరోనా నుంచి సేఫ్ గా బయటపడినట్లేనని చెబుతున్నారు. ఇప్పటిమాదిరే కేసుల నమోదు తక్కువగా ఉంటే.. యాక్టివ్ కేసుల సంఖ్యలోనూ గణనీయమైన తగ్గుదల కనిపించటం ఖాయం.