Begin typing your search above and press return to search.

కరోనాపై మూడు రోజుల్లో రెండో రివ్యూ.. కేసీఆర్ ఫోకస్ పెంచేశారుగా?

By:  Tupaki Desk   |   25 Nov 2020 6:30 AM GMT
కరోనాపై మూడు రోజుల్లో రెండో రివ్యూ.. కేసీఆర్ ఫోకస్ పెంచేశారుగా?
X
కొన్నిసార్లు అంతే. ఏదైనా ఇష్యూను టేకప్ చేస్తే చాలు.. దాని మీద వరుస పెట్టి రివ్యూలు నిర్వహించటం.. దాన్ని ఒక కొలిక్కి తెచ్చే వరకు వదలకపోవటం లాంటివి సీఎం కేసీఆర్ కు అలవాటు. కరోనా మొదట్లో అదే పనిగా రివ్యూలు నిర్వహించే ఆయన.. లాక్ డౌన వేళలో.. ఒక దశకు చేరుకున్న తర్వాత దాని గురించి ఊసెత్తటమే మానేశారు. ఆ తర్వాత దాని గురించి కొంతకాలం రివ్యూ కూడా నిర్వహించలేదు.

అలాంటి కేసీఆర్ తాజాగా మాత్రం కరోనా మీద ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. గడిచిన మూడు రోజుల్లో రెండు సార్లు రివ్యూను నిర్వహించటం చూస్తే.. దానికి ఆయన ఇస్తున్న ప్రాధాన్యత మరింత పెరగినట్లుగా చెప్పక తప్పదు. కోవిడ్ వ్యాక్సిన్ కార్యాచరణపై ప్రధాని మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు నేపథ్యంలో ఆయన రాష్ట్ర అధికారులతో మరో సమీక్షను నిర్వహించారు.

వ్యాక్సిన్ వచ్చినంతనే తొలుత ఆరోగ్య కార్యకర్తలకు.. తర్వాత కోవిడ్ ను ముందుండి నడిపించిన పోలీసులకు.. తర్వాత ఇతర శాఖల సిబ్బందికి అందించనున్నారు. తర్వాత ప్రాధాన్యతక్రమంలో అరవై ఏండ్లు దాటిని వారికి.. తీవ్రమైన జబ్బులతో బాధ పడుతన్న వారికి ఇవ్వాలన్న తన ఆలోచనను షేర్ చేసుకున్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే సెకండ్ వేవ్ ధాటికి విలవిలలాడుతున్న నేపథ్యంలో.. కరోనా విషయంలో మరింత ప్రాధాన్యత ఇవ్వాలన్నట్లుగా కేసీఆర్ తీరు ఉందని చెప్పక తప్పదు.