Begin typing your search above and press return to search.
హైదరాబాద్ ఖాకీల గుండెల్లో రైళ్లు.. ఆ పోలీస్ స్టేషన్ లో సెకండ్ వేవ్?
By: Tupaki Desk | 8 Dec 2020 3:30 AM GMTహైదరాబాద్ మహానగరంలోని వేలాది మంది పోలీసుల్లో కొత్త కలకలం మొదలైంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ తమ ప్రాణాల్ని పణంగా పెట్టి పని చేసే వారెందరో ఉన్నారు. అలాంటి వారికి సైతం కొత్త టెన్షన్ పుట్టే విషయం బయటకు వచ్చింది. కరోనా కేసులు వ్యాపిస్తున్న వేళ.. చాప కింద నీరులా హైదరాబాద్ మహానగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులకు కరోనా పాజిటివ్ లుగా నమోదు కావటం.. వారంతా వైద్యం చేయించుకోవటం చేయించుకున్నారు. లాక్ డౌన్ వేళ.. ప్రజలంతా ఇళ్లకు పరిమితమైన వేళ.. రాత్రి పగలు అన్న తేడా లేకుండా డ్యూటీ చేశారు.
అవసరం లేకున్నా బయటకు వచ్చే వారిని నియంత్రించే క్రమంలో తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టారు.ఈ క్రమంలో కొందరు పోలీసులు కరోనా బారిన పడ్డారు. అనంతరం బయటపడ్డారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు చెందిన నలుగురు ఎస్ ఐలు.. నలుగురు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు కూడా పాజిటివ్ గా తేలింది.
ఈ మొత్తం ఎపిసోడ్ లో షాకింగ్ నిజం ఏమంటే.. తాజాగా కరోనా పాజిటివ్ అని తేలిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు గతంలో కరోనా వచ్చి తగ్గింది. అంటే.. రెండోసారి వచ్చిందన్న మాట. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున డ్యూటీ నిర్వహించిన వారు ఇప్పుడు కరోనా బారిన పడినట్లుగా వస్తున్న వార్తలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా కన్ఫర్మ్ అయిన పోలీసులంతా నాలుగైదు రోజుల క్రితం ఫలితాలు వెలువడిన గ్రేటర్ ఎన్నికల్లో డ్యూటీ నిర్వహించిన వారే కావటం గమనార్హం. ఈ వ్యవహారం ఇప్పుడు హైదరాబాద్ పోలీసుల్లో కొత్త ఆందోళనకు గురి చేస్తోంది.