Begin typing your search above and press return to search.
బ్రిటన్ నుంచి వచ్చినోళ్లకు పాజిటివ్ వస్తే.. అక్కడ ఉంచుతారట
By: Tupaki Desk | 23 Dec 2020 3:11 AM GMTబ్రిటన్ లో బయటకు వచ్చిన కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రపంచాన్ని వణికిస్తుంది. మామూలు కరోనా కంటే 70 శాతం వేగంగా విస్తరించే ఈ వైరస్ కు వీలైనంత దూరంగా ఉండేందుకు ఆ దేశంలో పలు దేశాలు విమాన ప్రయాణాల్ని బ్యాన్ చేయటం తెలిసిందే. కొన్నిదేశాలైతే.. అన్ని రకాల రవాణాలపైనా పరిమితులు పెట్టేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. గడిచిన రెండు వారాలుగా బ్రిటన్ నుంచి వచ్చిన వారు ఎంతమంది? వారి పరిస్థితి ఎలా ఉందన్న విషయంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రెండు వారాల క్రితం వచ్చిన వారి కంటే కూడా.. వారం క్రితం వచ్చిన వారితోనే ఎక్కువ ప్రమాదం పొంచి ఉంటుంది.
ఇదిలా ఉండగా.. బ్రిటన్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన వారి కోసం ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. యూకే నుంచి నేరుగా వచ్చినా.. లేక ఆ దేశం మీదుగా వచ్చిన వారి ఆరోగ్యాన్ని వైద్య సిబ్బంది పర్యవేక్షించటంతో పాటు.. వారికి ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేయాలని నిర్ణయించారు. ఒకవేళ.. పరీక్షలో వారికి పాజిటివ్ వస్తే.. గచ్చిబౌలి లోని టిమ్స్ లో చికిత్స అందించాలని నిర్ణయించారు. వీరి కుటుంబ సభ్యుల్ని సైతం క్వారంటైన్ సెంటర్లలో ఉంచనున్నారు.
ఇందుకోసం వెయ్యి పడకల్ని సిద్ధం చేశారు. వీరికి వారం వ్యవధిలో మరోసారి పరీక్షలు నిర్వహిస్తారు. ఒకవేళ పరీక్షల్లో నెగిటివ వచ్చినా సరే.. 14 రోజుల పాటు వారి ఇంటి వద్దే క్వారంటైన్ ఉండాలి. మొత్తం 28 రోజుల వరకు పర్యవేక్షణ తప్పనిసరిగా తేల్చేశారు. బ్రిటన్ లో బయటపడ్డ కొత్త వైరస్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిర్దారణ కావటంతో.. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. అందరూ విధిగా మాస్కులు ధరించాలని.. నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించాలని కోరుతున్నారు. ఇప్పటికి బాగున్న వాతావరణాన్ని పాడు చేయొద్దని అధికారులు కోరుతున్నారు. సో.. బీకేర్ ఫుల్.