Begin typing your search above and press return to search.
కొత్త రకం కరోనా కల్లోలం... తెలంగాణలో ఇద్దరికి పాజిటివ్ , నిర్దారణ కోసం పూణే కి శాంపిల్స్ !
By: Tupaki Desk | 23 Dec 2020 5:06 AM GMTకరోనా మహమ్మారి జోరు ప్రపంచ వ్యాప్తంగా ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలోనే బ్రిటన్ లో కొత్త రకం కొరోనా వెలుగులోకి రావడంతో మళ్లీ అందరిలో ఆందోళన పెరిగిపోతుంది. ఈ మహమ్మారి కారణంగా లండన్ ప్రస్తుతం లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలోనే యూకే విమానాల్ని ప్రభుత్వం రద్దు చేసింది. అయితే , ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోకముందు అక్కడి నుండి విమానాల్లో బయల్దేరిన వారిలో దాదాపుగా 20 మందికి పాజిటివ్ గా వచ్చింది అని తెలుస్తుంది. అయితే ,అది పాత కరోనానేనా ,లేక కొత్త రకం కరోనా అని నిర్దారించాల్సి ఉంది. ఆ 20 మందిని ఇన్ స్టిట్యూషనల్ క్వారంటైన్ లోనే ప్రత్యేకంగా ఉంచి చికిత్స అందిస్తున్నారు. బ్రిటన్ నుంచి భారత్ వచ్చిన విమాన ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
బ్రిటన్ నుంచి మంగళవారం మూడు విమానాల్లో సుమారు 590 మంది ప్రయాణికులు ముంబై వచ్చారు. అయితే, ఈ ప్రయాణికుల్లో కరోనా లక్షణాలున్న వారెవరూ లేరని ఒక అధికారి తెలిపారు. వారిలో మహారాష్ట్ర కి చెందిన వారిని క్వారంటైన్ కు, ఇతర రాష్ట్రాల వారిని వారివారి రాష్ట్రాలకు పంపించామన్నారు. గత రెండు వారాల్లో బ్రిటన్ నుంచి కర్ణాటకకు సుమారు 500 మంది వచ్చారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ తెలిపారు. బ్రిటన్ నుంచి సోమవారం కోల్‌కతా వచ్చిన వారిలో ఇద్దరికి పాజిటివ్‌గా తేలిందని పశ్నిమబెంగాల్ అధికారులు వెల్లడించారు. యూకే నుంచి పంజాబ్‌లోని అమృతసర్‌కు 250 మంది ప్రయాణికులు, 22 మంది సిబ్బందితో సోమవారం అర్ధరాత్రి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలోని ప్రయాణికుల్లో ఏడుగురికి, సిబ్బందిలో ఒకరికి కరోనా సోకిందని రాష్ట్ర అధికారులు తెలిపారు. లండన్ నుంచి గుజరాత్ లోని అహ్మదాబాద్ కు మంగళవారం వచ్చిన విమాన ప్రయాణీకుల్లో నలుగురికి కరోనా సోకినట్లు గుజరాత్ అధికారులు మంగళవారం తెలిపారు.
ఇక బ్రిటన్ లో కొత్త రకం వైరస్ విజృంభణ కొనసాగుతుండటంతో తాజా మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 వరకు యూకేలో పర్యటించిన ప్రయాణీకులంతా పాటించాలని తెలిపింది. యూకే నుంచి వచ్చే ప్రయాణీకులంతా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేసుకోవాలని, పాజిటివ్ తేలిన వారిని ఇన్ స్టిట్యూషనల్ క్వారంటైన్ కేంద్రంలో ప్రత్యేకంగా ఉంచాలని , గత నాలుగు వారాల్లో యూకే నుంచి వచ్చిన విమానాలు, అందులోని ప్రయాణీకులు, సిబ్బంది వివరాలను బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అధికారులు రాష్ట్రాలకు, ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వీలెన్స్ ప్రోగ్రామ్ అధికారులకు ఇవ్వాలని, యూకే నుంచి వచ్చిన ప్రయాణీకులంతా 14 రోజుల ట్రావెల్ హిస్టరీని సంబంధిత రాష్ట్రాలకు అందించాలని వెల్లడించింది.
ఇక కరోనా కారణంగా బ్రిటన్ సరిహద్దు దేశాలన్ని కూడా బ్రిటన్ సరిహద్దుల్ని మూసేశాయి. రోడ్డు , విమాన మార్గాలని నిషేధించాయి. కొత్త వైరస్ భయంతో ఫ్రాన్స్ సరిహద్దులను మూసివేయడంతో బ్రిటన్ లోని మన్ స్టన్ ఎయిర్ పోర్టు సమీపంలో భారీగా లారీలు, భారీ రవాణా వాహనాలు భారీ ఎత్తున నిలిచిపోయాయి
ఇక తెలంగాణ లో కరోనా జోరు తగ్గినప్పటికీ , కొత్త వైరస్ భయం మళ్లీ ఆందోళనకి గురిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో అన్ని రాష్ట్రాలు ఇప్పటికే అప్రమత్తం అయ్యాయి. ఈ క్రమంలో గత నెల రోజుల నుంచి యూకే, తదితర ప్రాంతాల నుంచి సుమారుగా 3 వేల మంది ప్రయాణికులు వచ్చినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే రెండు వారాలుగా నేరుగా రాష్ట్రానికి 355 మంది తెలంగాణ వచ్చినట్లు గుర్తించి పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు.అయితే తాజాగా వైరస్ సోకిన వారిలో కొత్త తరహా వైరస్ ఉందా, లేదా అని గుర్తించేందుకు నమూనాలను పుణె లాబ్స్ కి పంపారు. మరోవైపు బ్రిటన్‌లో బయటపడి ప్రపంచాన్ని అలజడికి గురిచేస్తున్న కొత్త రకం కరోనా వైరస్ అంత డేంజర్ కాదంటున్నారు నిపుణులు. సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్ర మాట్లాడుతూ ఈ వైరస్ లక్షణాలన్నీ పాతవే అన్నారు. ఇప్పుడున్న నిర్ధారణ పరీక్షలతోనే పరీక్షించుకోవచ్చని వివరించారు. అయితే గత వైరస్ తో పోలిస్తే ఎక్కువ వ్యాప్తికి కారణమవుతుండటమే ఆందోళన కలిగిస్తుంది అన్నారు.
దేశంలో గత 24 గంటల్లో 23,950 మందికి కరోనా నిర్ధారణ అయింది. కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. కొత్తగా 26,895 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,00,99,066కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 333 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,46,444కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 96,63,382 మంది కోలుకున్నారు. 2,89,240 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.