Begin typing your search above and press return to search.

తొలిసారి తెలంగాణలో కొవాగ్జిన్ టీకా.. మొదటి డోసు వేసుకున్నదెవరంటే?

By:  Tupaki Desk   |   9 Feb 2021 8:30 AM GMT
తొలిసారి తెలంగాణలో కొవాగ్జిన్ టీకా.. మొదటి డోసు వేసుకున్నదెవరంటే?
X
వణికించిన మహమ్మారికి చెక్ పెట్టే వ్యాక్సిన్ రావటం.. దాని కారణంగా వైరస్ వ్యాప్తి తగ్గుతున్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ కు సంబంధించి పలు రకాలు వచ్చినా.. మన దేశంలో రెండింటికి మాత్రమే అనుమతి లభించింది. అందులో ఒకటి కోవిషీల్డ్ అయితే.. రెండోది హైదరాబాదీ కంపెనీ భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్. సంక్రాంతి పండుత తర్వాత నుంచి తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ వేస్తున్న సంగతి తెలిసిందే. తొలుత వైద్యులు.. వైద్య సిబ్బందికి టీకాలు వేస్తున్నారు.

అయితే.. ఇప్పటివరకు వేసిన వ్యాక్సిన్ కోవిషీల్డ్ మాత్రమే. భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్ ను ఇప్పటివరకు ఎవరూ వినియోగించలేదు. అందుకు భిన్నంగా తాజాగా కావొగ్జిన్ టీకాను వేయటం షురూ చేశారు. ఈ టీకా మొదటి డోస్ ను తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు వేసుకున్నారు. అనంతరం సీఆర్ పీఎఫ్ దక్షిణ విభాగ ఐజీ మహేష్ లద్దా వేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి 2.7లక్షల కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను కేంద్రం సరఫరా చేసింది. వ్యాక్సిన్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఈ విషయాన్ని స్పష్టం చేయటం కోసమే తాను కూడా టీకా తీసుకున్నట్లుగా తెలిపారు.

టీకా వేసుకున్న తర్వాత జ్వరం.. తలనొప్పి.. ఒళ్లు నొప్పులు రావటం సాధారణమేనని.. రోగనిరోధక శక్తి స్పందిస్తుందనటానికి అవి సంకేతాలుగా పేర్కొన్నారు. జ్వరం.. తలనొప్పి.. ఒళ్లు నొప్పులు రోగ నిరోధకతకు సంకేతాలుగా ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్ ద్వారా శరీరంలో తయారయ్యే యాంటీబాడీలు వైరస్ నుంచి మనల్ని రక్షిస్తాయన్నారు. తొలిసారి వేసుకున్న కొవాగ్జిన్ వ్యాక్సిన్ కారణంగా ఇప్పటివరకు ఎలాంటి సైడ్ ఎఫెక్టులు నమోదు కాలేదు. సోమవారం ఒక్కరోజులో51,500 మందికి టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే కేవలం 41 శాతం మందే టీకాలు వేసుకోవటం గమనార్హం. టీకా వేయటం మొదలు పెట్టిన రోజు నుంచి ఇప్పటివరకు తెలంగాణలో 2.28లక్షల మంది టీకాలు తీసుకున్నారు.