Begin typing your search above and press return to search.

తెలంగాణకు కరోనా దెబ్బ మామూలుగా పడలేదుగా?

By:  Tupaki Desk   |   12 March 2021 12:30 PM GMT
తెలంగాణకు కరోనా దెబ్బ మామూలుగా పడలేదుగా?
X
మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు షురూ కానున్నాయి. ఇప్పటికే వార్షిక బడ్జెట్ మీద భారీ కసరత్తు పూర్తి కావటమే కాదు..కొత్త విషయాన్నిఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్నాన్ని కరోనా భారీగా దెబ్బేసిన వైనాన్ని అధికారులు అదే పనిగా చెబుతున్నారు. అన్నింటికి మించి.. కరోనా కారణంగా తెలంగాణ ప్రభుత్వ ఖజానాపై ప్రభావం తీవ్రంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ ఆర్థిక సంవత్సరంలో కరోనా కారణంగా రూ.50వేల కోట్ల ఆదాయాన్ని పోగొట్టుకున్నట్లుగా తేల్చారు. దీంతో.. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవటానికి తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు.. ఈ ఏడాది ఇప్పటివరకు తీసుకున్న అప్పులు రికార్డు స్థాయిలో రూ.45వేల కోట్లకు చేరుకున్నాయి. ఈ మార్చి చివరి నాటికి కాస్త అటుఇటుగా రూ.50వేల కోట్లను దాటే వీలుందని చెబుతున్నారు.

మొత్తంగా చూస్తే.. రూ.50వేల కోట్ల పన్ను ఆదాయాన్ని తెలంగాణ సర్కారు కోల్పోతే.. అంతే మొత్తంలో కొత్తగా అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఖర్చులు అంతకంతకూ పెరిగిపోవటం.. ఆదాయం తగ్గిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్తులు అమ్ముకోవటం తప్పించి మరో మార్గం లేదంటున్నారు. ఇప్పటికే పెరిగిన ధరలు.. పన్ను పోటుపై సగటుజీవి తీవ్ర ఆగ్రహంగా ఉన్న వేళ.. తాజా భారం మీద పడితే సామాన్యుడు కస్సుమనటం ఖాయమని చెప్పక తప్పదు. ఇప్పుడున్న గడ్డు పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేయనుందన్నది కోటి రూకల ప్రశ్న.