Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో మళ్లీ కరోనా విజృంభన...ఒక్కరోజే ఎన్నంటే ?
By: Tupaki Desk | 18 March 2021 6:30 AM GMTకరోనా వైరస్ తగ్గినట్లే తగ్గి మారోసారి విజృంభిస్తోంది. ఇప్పటి వరకు మార్కెట్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు వేదికగా వెలుగు చూసిన వైరస్ తాజాగా ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గత కొద్దిరోజులుగా చాలాచోట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా వైరస్ బారినపడుతున్నారు. రెండు రోజుల క్రితం బండ్లగూడ మైనార్టీ రెసిడెన్షి యల్ స్కూల్లో 38 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా,బుధవారం కూకట్ పల్లిలోని ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో 20 మంది విద్యార్థులతో పాటు నాగోల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఎలాంటి లక్షణాలు లేకపోయినా పరీక్షల్లో వైరస్ నిర్ధారణ అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ప్రభుత్వం గతేడాది జూన్ నుంచి లాక్ డౌన్ నిబంధనలను క్రమంగా సడలిస్తూ వచ్చింది. స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోవడంతో పాటు హోటళ్లు, పార్కులు, ఇతర దర్శనీయ ప్రదేశాల్లోకి ప్రజలను అనుమతించారు. దీంతో జనం బయటకు రావడం బాగా పెరిగింది. ఇక వ్యాక్సిన్ సైతం ఇస్తుండడంతో ప్రజలు స్వీయ నియంత్రణను పూర్తిగా విస్మరిస్తున్నారు. మాస్కులు, శానిటైజేషన్, భౌతికదూరం నిబంధనలూ గాలికొదిలేశారు. దీంతో వైరస్ వేగంగా విస్తరిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 301769 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటిలో రెండు లక్షల కేసులు గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే ఉన్నాయి. అంతేకాదు 1659 మంది మృతుల్లో వెయ్యి మందికిపైగా గ్రేటర్ వాసులే.
కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఘోరంగా విఫలం అవుతున్నారు. అనుమానంతో పీహెచ్‌సీలకు వచ్చే వారికి టెస్టులు చేయడం మినహా ఆ తర్వాత ఎలాంటి ఫాలోఅప్ లు చేయడం లేదు. వైద్య ఆరోగ్యశాఖ ప్రస్తుతం కేసుల ట్రేసింగ్ ను పూర్తిగా మర్చిపోయింది. కంటైన్మెంట్ జోన్ల పద్ధతిని కూడా పూర్తిగా ఎత్తేసింది. హోం ఐసోలేషన్ లో ఉన్నవారిపై నిఘా కూడా లేదు.అధికారికంగా ప్రకటించిన నివేదిక ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ లో గత వారంలో రోజుల్లో 511 కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 278, రంగారెడ్డి జిల్లాలో 104, మేడ్చల్ జిల్లాలో 129 కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం సీజన్ మారింది. చలి పోయి ఉక్కపోత మొదలైంది. వాతావరణంలో చోటు చేసుకున్న ఈ మార్పులతో అనేక మంది జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. కరోనా వైరస్‌లోనూ ఇవే లక్షణాలు కన్పిస్తాయి. ఫలితంగా ఎవరికి కరోనా ఉందో, మరెవరికి రానుందో, గుర్తించడం వైద్యులకూ ఇబ్బందిగా మారింది. దగ్గు, జలుబు, జ్వరంతో పాటు ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 278 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం... గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 111 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,047కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,98,120 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,662గా ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 35 మందికి కరోనా సోకింది.