Begin typing your search above and press return to search.
హైదరాబాద్ గర్ల్స్ స్కూలులో 44 మందికి కరోనా
By: Tupaki Desk | 21 March 2021 5:30 PM GMTహైదరాబాద్ శివారు శంషాబాద్ పరిధిలోని ఓ స్కూలులో కరోనా వైరస్ కలకలం చోటుచేసుకుంది. పాలమాకులలో గురుకుల స్కూలులో 44 మంది కరోనా బారినపడడం కలకలం రేపింది. మూడు రోజుల క్రితం కొంత మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో పాఠశాల యాజమాన్యం కోవిడ్ పరీక్షలు చేయగా 44 మందికి కరోనా పరీక్షలు చేసింది.
పాఠశాలలోని 6-10వ తరగతి వరకు మొత్తం ఇక్కడ 900 బాలికలు ఉన్నారు. వారిలో దాదాపు 500 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో మూడు రోజుల కింద 23 మందికి పాజిటివ్ అని తేలింది. ఇప్పుడు మరో 21 మందికి కరోనా సోకినట్లు వైద్యులు తేల్చారు. ఇంకా మరికొంత మంది ఫలితాలు రావాల్సి ఉందని గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్ శివగీత తెలిపారు. పాఠశాలలోని మిగిలిన 400 మంది విద్యార్థులకు పరీక్షలు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఇక విద్యార్థులకు కరోనా అని తేలడంతో గురుకులంలోనే ప్రత్యేక ఐసోలేషన్ ఏర్పాటు చేస్తున్నారు. వీరికి పౌష్టికాహారంతోపాటు వైద్యం కూడా సక్రమంగా అందిస్తున్నట్టు ప్రిన్సిపాల్ తెలిపారు.
ఇక పాతబస్తీలోని రాజన్న బావి బీసీ వసతి గృహంలో 70మందికి కరోనా టెస్ట్ చేయగా 9మందికి బయటపడింది. వీరికి ఐసోలేషన్ వార్డులో వైద్యం చేస్తున్నారు.