Begin typing your search above and press return to search.
పుకార్లకు తోడైన నకిలీ జీవో.. షాపుల సమయాన్ని కుదించట్లేదన్న సోమేశ్
By: Tupaki Desk | 2 April 2021 4:10 AM GMTతెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఏపీతో పోలిస్తే.. తెలంగాణలో కేసుల నమోదు తక్కువగా ఉన్నట్లుగా ప్రభుత్వం విడుదల చేస్తున్న నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవం అందుకు భిన్నంగా ఉందన్న మాట వినిపిస్తోంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తెలంగాణలో షాపులు తెరిచి ఉంచే సమయాన్ని కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో నకిలీ జీవో ఒకటి వైరల్ అవుతోంది. ఇప్పటికే లాక్ డౌన్ మీద జరుగుతున్న తప్పుడు ప్రచారం ఒక ఎత్తు అయితే.. మరోవైపు రాత్రివేళ దుకాణాల్ని త్వరగా మూసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా జీవో ఒకటి వైరల్ అవుతుంది.
ఈ తప్పుడు జీవో ప్రకారం సాయంత్రం ఆరు గంటలకే షాపులు మూసేలా ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ఉంది. అయితే.. ఈ జీవో నకిలీదిగా తేల్చారు. అంతేకాదు లాక్ డౌన్ ఉండదని స్పష్టం చేశారు. తప్పుడు జీవోను రూపొందించి ప్రచారం చేస్తున్నారే తప్పించి.. అందులో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. సో.. నకిలీ పోస్టుల్ని నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.