Begin typing your search above and press return to search.
తెలంగాణ లో కరోనా బీభత్సం ... దేశంలో ఒక్కరోజే ఎన్నంటే ?
By: Tupaki Desk | 17 April 2021 8:30 AM GMTదేశంలో కరోనా వైరస్ విజృంభణ ఉగ్రరూపం దాల్చింది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజు కూడా దాదాపుగా రెండు లక్షలకి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండడం కలకలం రేపుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 2,34,692 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం .. నిన్న 1,23,354 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,45,26,609కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 1,341 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,75,649కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,26,71,220 మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా 11,99,37,641 మందికి వ్యాక్సిన్లు వేశారు.
ఇక తెలంగాణ లో కూడా కరోనా జోరు రోజురోజుకి పెరిగిపోతుంది. వరుసగా రెండు రోజులు 3వేలకి పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. శుక్రవారం రికార్డు స్థాయిలో 4వేల కేసులు వెలుగులోకి రాగా , మరో 12 మంది కరోనాతో మృతి చెందారు. గత కొద్దిరోజులుగా మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మరో 6336 రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,46,331కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1,809కి చేరింది. ప్రస్తుతం 33,514 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1414 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,11,008కి చేరింది. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.2శాతం ఉండగా... తెలంగాణలో 0.52శాతం ఉంది. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 87.2 శాతం ఉండగా తెలంగాణలో 89.8 శాతం ఉంది.