Begin typing your search above and press return to search.

కరోనా శవాలకు అర్థరాత్రుల్లో అంత్యక్రియలు

By:  Tupaki Desk   |   24 April 2021 7:30 AM GMT
కరోనా శవాలకు అర్థరాత్రుల్లో అంత్యక్రియలు
X
కరీంనగర్ జిల్లాలో ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక కరోనాతో చనిపోయిన వారి సంఖ్య కూడా పెరుగుతున్నట్టు సమాచారం. అయితే కరోనా మృతులను కుటుంబ సభ్యులు తీసుకుపోకపోవడంతో ఆ మృతదేహాలను అర్ధరాత్రి తీసుకొచ్చి వరుసగా పేర్చి ఖననం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది నిజమా కాదా? అన్నది మాత్రం నిర్ధారణ కావాల్సి ఉంది.

కరీంనగర్ లో రోజుకు పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంబులెన్స్ లు, ప్రైవేటు వాహనాల్లో మానేరు నదీ తీరంలో ఉన్న శ్మశాన వాటికకు అర్ధరాత్రి వేళ మృతదేహాలను తీసుకొచ్చి దహనం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

తాజాగా అర్ధరాత్రి ఇలా వరుసగా చితులు పేర్చి 18 మృతదేహాలకు కరీంనగర్ మానేరు వాగు తీరంలో అంత్యక్రియలు చేసిన విషయం వెలుగుచూసింది. ఈ మృతదేహాలు ఏ ఆస్పత్రుల నుంచి వచ్చాయన్న వివరాలు ఎవరూ పేర్కొనలేదు. పకడ్బందీగా ప్యాక్ చేసి తీసుకొస్తుండడంతో ఇవి కరోనా మృతదేహాలేనని స్థానికులు అనుమానిస్తున్నారు..

కరీంనగర్ జిల్లాలో కరోనాతో ఇటీవల మరణాలు ఎక్కువైనట్టు సమాచారం.. గత మూడు రోజుల్లో ప్రభుత్వ ఆస్పత్రిలో 13 మంది.. ప్రైవేటు ఆస్పత్రిలో 16 మంది చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా ఈ లెక్కలు బయటపెట్టడం లేదు. దీంతో వాస్తవాలు బయటకు రావడం లేదు.

అర్ధరాత్రి వాహనాల్లో మృతదేహాలను తీసుకొస్తున్నారని.. భయం భయంగానే అంత్యక్రియలు చేస్తున్నట్లు శ్మశాన వాటిక నిర్వాహకులు చెబుతున్నట్టు మీడియాలో వార్తలు వెలువడ్డాయి.

ఇక కరోనా భయంతో మృతదేహాలను ఖననం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రావడం లేదు. కొన్ని బృందాలు రూ.50వేలు తీసుకొని ఈ శవాలను తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. గడిచిన 36 రోజుల్లో జిల్లాకు చెందిన 89 మంది ఇలా కరోనాతో చనిపోయారని.. పక్కన నాలుగు జిల్లాల నుంచి వచ్చి చికిత్స పొందిన చనిపోయిన వారిని ఇక్కడే మానేరు తీరంలో ఖననం చేస్తున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా అటు ఆస్పత్రివర్గాలు, అధికారులు వెల్లడించలేదు. మీడియా వార్తలను బట్టి కరోనా మృతుల సంఖ్య పెరుగుతున్నట్టు తెలుస్తోంది.