Begin typing your search above and press return to search.
మరణమృదంగం.. హైదరాబాద్ లోని ఆ రెండు ఆసుపత్రుల్లో రోజులో 115 మంది మృతి?
By: Tupaki Desk | 26 April 2021 12:30 PM GMTకరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. రెండో దశలో దేశ వ్యాప్తంగా పది రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక మోస్తరు పరిస్థితి ఉందన్న మాట చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి వేరుగా ఉందన్న వాదన మొదట్నించి వినిపిస్తున్నదే. అధికారిక సమాచారం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజుకు దగ్గర దగ్గరగా 20వేల పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నట్లు చెబుతున్నా.. వాస్తవం మరింత ఎక్కువగా ఉందంటున్నారు. ప్రభుత్వాలు విడుదల చేసే బులెటెన్లు.. రిపోర్టల ప్రకారం ఆసుపత్రుల్లో బెడ్లకు కొరత లేదని చెబుతున్నా.. వాస్తవం అలా లేదన్న మాట వినిపిస్తోంది.
కాస్తలో కాస్త మెరుగైన విషయం.. ఆక్సిజన్ కొరత తీవ్రంగా లేకపోవటంగా చెప్పాలి. ఇదిలా ఉంటే.. కరోనా మరణాలు లెక్కలకు ఏ మాత్రం సూట్ కాని రీతిలో భారీగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆదివారం ఒక్కరోజులో హైదరాబాద్ లోని రెండు ఆసుపత్రుల్లో చోటు చేసుకున్న మరణాలు భారీగా ఉన్న షాకింగ్ నిజం బయటకు వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం గాంధీ.. గబ్బిబౌలిలో ఏర్పాటు చేసిన కరోనా ఆసుపత్రి టిమ్స్ లో కలిపి మొత్తం 115 మంది మరణించినట్లుగా ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది. సదరు మీడియా సంస్థ రిపోర్టు ప్రకారం గాంధీలో 75 మంది.. టిమ్స్ లో 40 మంది మరణించినట్లుగా పేర్కొన్నారు.
కేసు తీవ్రత బాగా పెరిగిపోయిన తర్వాత ప్రైవేటు ఆసుపత్రులతో పాటు.. పలు ఇతరఆసుపత్రుల నుంచి రోగులు గాంధీకి చేరుకోవటంతో .. మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. మరణాలు గాంధీ లెక్కలో వేస్తున్నా.. వాస్తవానికి దాని బాధ్యత చాలా చాలా తక్కువని చెబుతున్నారు. మరి ముఖ్యంగా.. తామిక ఏమీ చేయలేమని.. గాంధీకి తీసుకెళ్లాలని చెప్పటంతో దిక్కుతోచని స్థితిలో గాంధీకి తీసుకొస్తున్నారు. దీంతో.. కేసుల రద్దీ పెరిగి.. అంబులెన్సులు బారులు తీరుతున్నాయి.
దీంతో.. ఆసుపత్రిలో చేర్చుకునే ప్రక్రియ ఆలస్యమవుతోంది. అంబులెన్సులో వస్తున్న ఒక్కోరోగిని ఆసుపత్రిలోకి చేర్చుకోవటానికే మూడు.. నాలుగు గంటలు పడుతుందని ఆరోపిస్తున్నారు. అసలే ప్రాణాపాయ స్థితిలో వస్తున్న వారు కాస్తా.. గంటల కొద్దీ సమయం వైద్యం అందకపోవటంతో త్వరగా మరణిస్తున్నట్లుగా చెబుతున్నారు. గాంధీ పరిస్థితి ఇలా ఉంటే.. టిమ్స్ లో సిబ్బంది కొరత కారణంగా మరణాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.
ఏడాది క్రితం సీఎం కేసీఆర్ భారీ ప్రకటనతో ఈ ఆసుపత్రిని షురూ చేశారు. ఏడాది క్రితం ఏమైతే ఏర్పాట్లు చేశారో అవే తప్పించి.. సిబ్బందిని ఇప్పటికి పూర్తిస్థాయిలో నియమించుకోలేదు. నిజానికి.. కరోనా బాధితులకు టిమ్స్ అండగా నిలవాల్సింది. బ్యాడ్ లక్ ఏమంటే.. అన్ని ఉన్నా.. అల్లుడి నోట్లో శని ఉన్న చందంగా.. టిమ్స్ లో వసతులు ఉన్నప్పటికి పూర్తిస్థాయి సిబ్బంది సామర్థ్యం లేకపోవటంతో.. కేసులు పెరిగి వాటిపై ఎక్కువ శ్రద్ధ చూపించలేని దుస్థితి. ఏమైనా.. తాజాగా చోటు చేసుకుంటున్నట్లు చెబుతున్న మరణాలు సంఖ్య షాకింగ్ గా మారింది.