Begin typing your search above and press return to search.
పునర్జన్మనిచ్చిన ఆస్పత్రి ముందు కరోనా విజేత ఏం చేసిందో తెలుసా?
By: Tupaki Desk | 30 April 2021 6:30 AM GMTగత నెల నుంచి కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఈ మహమ్మారి నుంచి విముక్తి పొందుతున్నవారి సంఖ్య అధికంగానే ఉంది. ఓ మహిళ కరోనాను జయించారు. ఆమె ఇప్పుడు చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కరోనా బారిన పడిన ఆ మహిళది హైదరాబాద్. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడితే హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్తే ఆక్సిజన్ లేదని చెప్పారు. ఏం చేయాలో తెలియని స్థితిలో బంధువుల నుంచి కాల్ వచ్చింది.
హైదరాబాద్ నుంచి గద్వాల జిల్లా ఆస్పత్రిలో చేర్చారు. ఆ ఆస్పత్రిలో ప్రాణవాయువు కొరత లేదనగా అక్కడికి తరలించారు. తీవ్ర శ్వాస సంబంధ సమస్యలతో బాధపడిన ఆ మహిళ క్రమంగా వారం రోజుల్లో వైరస్ ను జయించారు. పూర్తిగా కోలుకొని ఇంటికి వెళ్లారు. కానీ తనకు పునర్జన్మనిచ్చిన వైద్యులు, ఆస్పత్రికి ఎలాగైనా కృతజ్ఞత చెప్పాలని ఆ మహిళ ఆలోచించారు. అందుకే తనదైన రీతిలో ధన్యవాదాలు తెలియజేశారు.
కరోనాను జయించిన అనంతరం ఆ మహిళ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులను కలిశారు. ఊపిరి ఆడక కొట్టుమిట్టాడుతున్న సమయంలో తనకు ప్రాణం పోసిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆస్పత్రి ముందు మొక్కలు నాటారు. ఆక్సిజన్ కొరతతో తాను అల్లాడిపోయానని... అందుకే మొక్కలు నాటానని చెప్పారు. అలా మొక్కలు నాటి తనదైన రీతిలో ఆ ఆస్పత్రికి ధన్యవాదాలు తెలిపారు.
తన భార్యకు ఊపిరి పోసిన ఆస్పత్రి, వైద్య బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు అని ఆమె భర్త అన్నారు. పరిస్థితి చేయిదాటింది అనుకున్న సమయంలో ఈ ఆస్పత్రి పునర్జన్మనిచ్చిందని తెలిపారు. ఆస్పత్రికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని కరోనాను జయించిన ఆమె అన్నారు.