Begin typing your search above and press return to search.
కరోనా కొమ్ములు పదును చేసిన ‘పొజిషన్ 69/70, 144/145’
By: Tupaki Desk | 23 Dec 2020 5:30 AM GMTదగ్గర దగ్గర ఏడాది నుంచి కోవిడ్19కు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటున్న ప్రజలకు.. ఈ వైరస్ కు సంబంధించిన చాలా విషయాలు అవగాహనకు వచ్చేశాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు కొత్త కలకలంగా మారిన బ్రిటన్ వైరస్ వణుకు తెప్పిస్తోంది. వైరస్ ఏదైనా కానీ.. మనిషి శరీరంలోకి వెళ్లి.. తిష్ట వేసుకున్న తర్వాత అది అంతో ఇంతో తనను తాను మార్పులు చేసుకుంటుంది. అదేమీ కొత్త విషయం కాదు. ఆ మాటకు వస్తే కోవిడ్ 19 ఇప్పటికి పలుమార్పులు చేసుకుంది.
అయితే.. ఇప్పటివరకు చోటు చేసుకున్న మార్పులు ఏవీ అంతగా ఇబ్బంది పెట్టింది లేదు. కానీ బ్రిటన్ లో గుర్తించిన ‘ఏ2బీ’తోనే అసలు చిక్కంతా. రెగ్యులర్ వైరస్ కంటే 70 శాతం అత్యధిక వేగంతో విస్తరిస్తున్న ఈ వైరస్ ను తొలిసారి అక్టోబరులోనే గుర్తించారు. అయితే.. దాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. సహజంగానే వైరస్ జన్యువుల్లో జరిగే మార్పుల్లో భాగంగానే గుర్తించారు. అయితే.. ఈ వైరస్ బ్రిటన్ లోని ఒక భాగంలో విపరీతంగా విస్తరించటంతో పరిశోధకులు దీని మీద మరింత ఫోకస్ పెంచారు.
మారిన ‘ఏ2బీ’ వైరస్ జన్యువుల్ని మరింత లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేసినప్పుడు కొత్త విషయాలు బయటకు వచ్చింది. బ్రిటన్ వైరస్ లో మొత్తం 23 రకాల జన్యు మార్పులు చోటు చేసుకున్నట్లుగా గుర్తించారు. అన్నింటికి మించి జన్యు క్రమంలో రెండు చోట్ల తొలగింపులు ఉండటం వేగంగా వైరస్ వ్యాప్తికి కారణంగా భావిస్తున్నారు. ఆ తొలగింపులే ‘‘పొజిషన్ 69/70, 144/145’’గా గుర్తించారు. దీని పుణ్యమా అనే.. కొత్త తరహా వైరస్ వేగంగా విస్తరించటానికి... కోవిడ్ కొమ్ములు మరింత పదును చేసేలా చేసిందంటున్నారు.
కోవిడ్ కు ఉండే కొమ్ముల్లోనే అధిక జన్యు మార్పులు చోటు చేసుకోవటం.. వైరస్ నకళ్లు ఏర్పడే వేగం ఎక్కువగా ఉంటుందని బ్రిటన్ కు చెందిన నిపుణులు టీం సభ్యుడు వెండీ బార్క్ లే చెబుతున్నారు. ఈ పొజిషన్ ప్రపంచానికి సరికొత్త సవాలుగా మారిందని చెప్పక తప్పదు.