Begin typing your search above and press return to search.

కరోనా కల్లోలం..బ్రిటన్ లో లక్ష దాటిన కరోనా మరణాలు!

By:  Tupaki Desk   |   27 Jan 2021 6:00 AM GMT
కరోనా కల్లోలం..బ్రిటన్ లో లక్ష దాటిన కరోనా మరణాలు!
X
కరోనా వైరస్ విజృంభణ తగ్గుతూ , పెరుగుతూ పలు దేశాల ప్రజలని భయంతో వణికిపోయేలా చేస్తుంది. ఇక యూకె ‌లో కరోనా మరణాలు లక్ష మార్క్‌ ను దాటాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,04,000 మంది కరోనా కాటుకి బలైపోయినట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో అమెరికా, బ్రెజిల్, భారత్ తర్వాత అత్యధిక మరణాలు సంభవించిన నాల్గో దేశంగా బ్రిటన్ నిలిచింది. కాగా, గతేడాది డిసెంబర్‌ లో ఈ దేశంలో ఒక్కసారిగా మరణాలు పెరగడంతో అత్యధిక మరణ రేటును కూడా నమోదు చేసింది. ఇక మృతుల్లో అత్యధికంగా వృద్ధులే ఉన్నట్లు సమాచారం. బ్రిటన్‌ లో బయటపడ్డ కొత్త స్ట్రెయిన్ తర్వాత కొత్త కేసులు గణనీయంగా పెరిగాయి. దీనితో యూకే మూడోసారి లాక్‌ డౌన్ విధించింది.

ప్రపంచంలో లక్షపైగా మరణాలు నమోదైన ఐదో దేశం యూకే. దేశంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 36.70 లక్షలు. దీని ప్రకారం మరణాల రేటు 2.72గా ఉంది. దాదాపు రెండు నెలలుగా యూకేలో కొత్త రకం స్ట్రెయిన్‌ తీవ్రత ఉంది. 70 శాతం వేగంగా వ్యాపించే ఈ కొత్త రకం వైరస్‌ కారణంగా 40 వేల మందికి వరకు పాజిటివ్‌ నిర్ధారణ అవుతోంది. మంగళవారంతో ప్రపంచ కేసులు 10 కోట్లు దాటాయి. ఇందులో అమెరికా 2.60 కోట్లు. కాగా, కరోనా కట్టడికి ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకువచ్చారు పరిశోధకులు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ కొనసాగుతుండగా,కొన్ని వ్యాక్సిన్లు ప్రయోగదశలో ఉన్నాయి. మరి కొన్ని నెలల్లో వ్యాక్సిన్‌ ప్రపంచ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇకపోతే , ఈ భారతదేశంలో గత 24 గంటల్లో 12,689 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 13,320 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,89,527కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 137 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,53,724కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,03,59,305 మంది కోలుకున్నారు. 1,76,498 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్ ‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 20,29,480 మందికి వ్యాక్సిన్లు వేశారు.