Begin typing your search above and press return to search.
స్మృతి ఇరానీ నియోజకవర్గంలోని ఆ గ్రామంలో కరోనా బీభత్సం !
By: Tupaki Desk | 17 May 2021 5:09 AM GMTదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం కొనసాగుతుంది. ప్రతిరోజు కూడా లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే కరోనా భారిన పడి మరణించిన వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది.ఉత్తర ప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాల్లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. నెల రోజుల వ్యవధిలో ఇరవై నుంచి ముప్పై మంది కరోనా బాధితులు మరణించిన గ్రామాలు చాలా ఉన్నాయి. ఇంత జరుగుతున్నా ఈ రోజు కీ ఆయా గ్రామాల్లో కనీసం కరోనా వైరస్ మహమ్మారి టెస్టులు కూడా నిర్వహించకపోవడం గమనార్హం. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంటరీ నియోజకవర్గం అమేఠీ లోని ఒక గ్రామంలో ఇటువంటి భయానక పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అమేఠీలోని హరిమౌ గ్రామంలో కరోనాతో 20 మంది మృతిచెందారు.
ఆ గ్రామంలో ఏ రోజూ కూడా ఈ విధమైన మరణాలు చోటుచేసుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రాజేంద్ర కౌశల్ మాట్లాడుతూ గ్రామంలోని కొన్ని ఇళ్లలో ముగ్గురు చొప్పున మృతి చెందారు అన్నారు. ఆ గ్రామానికి చెందిన షహ్నవాజ్ మాట్లాడుతూ తమ గ్రామంలో చోటుచేసుకుంటున్న మరణాలకు కారణం ఏమిటో తెలియడం లేదని అన్నారు. అయితే కొంతకాలం క్రితం ఆరోగ్య శాఖ బృందం వచ్చి మందులు ఇచ్చి వెళ్లిపోయిందన్నారు. ఇక గ్రామంలో చోటుచేసుకుంటున్న మరణాలపై గ్రామస్తులు భయపడుతున్నారని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ గ్రామం గురించి పట్టించుకోని స్మృతి ఇరానీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.